Man play with three venemous cobra snakes video: సోషల్ మీడియాలో రోజూ వింత వింత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా నాగుపాములు, కొండచిలువలు మరియు అనకొండ వీడియోలకు నెట్టింట మంచి రెసాన్స్ వస్తుంది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా భారీ సంఖ్యలో ఇలాంటి వీడియోలను డంప్ చేస్తున్నారు. అందులో కొంచెం వెరైటీగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.
పాముల్లో భయంకరమైనది కింగ్ కోబ్రా. ఇది ఒక్క కాటుతోనే ఎలాంటి జంతువునైనా, మనిషినైనా చంపేస్తోంది. అలాంటి కోబ్రాను ఒకదానిని చూస్తేనే మనం వణుకుతాం. కానీ ఓ వ్యక్తి మూడు నాగుపాములతో ఆటలాడాడు. అవి కాటు వేస్తాయనే భయం లేకుండా వాటి ముందు కూర్చన్నాడు. తన చేతులను, కాళ్లను అటు ఇటు ఆడిస్తూ ఆ కోబ్రాలను ముప్పుతిప్పలు పెట్టాడు. అవి చాలా సార్లు అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించి ఆ పాములు విఫలమయ్యాయి. అక్కడున్న వారు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియోను munna_snake_rescuer అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. దీనికి ఇప్పటి వరకు లక్షా 58 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. అతడి ధైర్యానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అతడు స్నేక్ క్యాచర్ కావడం వల్లే వాటితో ఆడుకోగలిగాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. అతడు నాగరాజ్ అంటూ ఇంకొందరు కామెంట్ పెడుతున్నారు. మెుత్తానికి ఈవీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
Also Read: Viral Video -రన్నింగ్ ట్రైన్ లో స్నానం చేసిన యువకుడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..


