Saturday, November 15, 2025
Homeవైరల్Viral video: భారీ కొండచిలువపై స్వారీకి చిన్నారి యత్నం.. షాక్ లో నెటిజన్స్..

Viral video: భారీ కొండచిలువపై స్వారీకి చిన్నారి యత్నం.. షాక్ లో నెటిజన్స్..

Baby Girl playing with huge python: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పాముల వీడియోలకు ఆదరణ పెరిగింది. దీంతో రోజూ వేలల్లో వీడియోలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో ఏ వీడియో కాస్త ఢిపరెంట్ గా ఉంటుందో అది వైరల్ అవుతోంది. ముఖ్యంగా నాగుపాములు, కొండచిలువలు, అరుదైన నాగ జాతులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. అయితే తాజాగా ఓ భయంకరమైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. ఇందులో ఒక భారీ కొండ చిలువ సోఫాపై నుంచి నెమ్మదిగా వెళ్తుంది. ఇంతలో ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్నారి కొండ చిలువను చూసి భయపడకుండా దాని దగ్గరకు వెళ్తుంది. అంతేకాకుండా ఆ బాలిక ముసిముసి నవ్వులు నవ్వుతూ దానిపై ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఆ చిన్నారి బాలిక అది ఏ ఆట వస్తువో లేదా వాహనమో అనుకోని ఉండాలి, లేదంటే అతి పెద్ద భారీ పైతాన్ పై ఎక్కాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కొండ చిలువపై బాలిక ఎక్కిన దానికి చీమ చిటుక్కుమన్నట్లు కూడా లేదు. ఇంత జరుగుతున్న ఆ పాము మాత్రం అక్కడ నుంచి మరో చోటుకి నెమ్మదిగా వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ వీడియోపై నెటిజన్స్ నుంచి మిక్సడ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇది పెంపుడు కొండచిలువ అని, అందుకే ఆ బాలిక అంత దైర్యంగా ఎక్కగలిగిందని కొందరు అంటుంటే..పైతాన్ ఎప్పుడు పెంపుడు జంతువు కాదని మరొకరు అంటున్నారు. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలుఈ వీడియో ఎక్కడిది, అందులో కనిపిస్తున్న ఆ బాలిక ఎవరు అనేది తెలియరాలేదు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

Also read: Viral video – నాగుల పంచమి నాడు అద్భుతం..శివలింగాన్ని చుట్టుకుని బుసలు కొడుతున్న భారీ నాగుపాము.. వీడియో ఇదిగో!

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad