Patient’s family attacks woman doctor at Jammu hospital: జమ్ము ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు రోగి బంధువులు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పేషెంట్ మరిణించాడంటూ ఆరోపిస్తూ..మహిళా సర్జన్ పై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ ప్రభుత్వాసుపత్రిలో ఓ రోగి బ్రెయిన్ హేమరేజ్‌తో మరణించాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడంటూ పేషెంట్ బంధువులు అత్యవసర వార్డులోకి చొరబడి డాక్టర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మహిళా వైద్యురాలి కడుపుపై తన్నడం వీడియోలో చూడవచ్చు. ఈ విషయంపై అంతర్గత విచారణ ప్రారంభించారు.
గతంలోనూ..
ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాలలో వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బందిపై దాడుల జరగడం చూస్తూనే ఉన్నాం. రెండు వారాల కిందట ఢిల్లీలోని జీటీబీ ఆస్పుత్రిలో ఒక సీనియర్ వైద్యుడు రౌండ్స్ లో ఉండగా.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి కొన్ని రోజుల ముందు రాజధానిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నవజాత శిశువు మరణించిన నేపథ్యంలో బిడ్డ బంధువులు మహిళా రెసిడెంట్ డాక్టర్ పై దాడి చేశారు. ఈసంఘటన అప్పట్లో సంచలనం రేపింది.


