Blue Snake Viral Video: మనలో చాలా మంది పాము పేరు చెబితేనే భయపడతారు. అలాంటిది వాటిని చూస్తే ఇంకేమైనా ఉందా..అర కిలోమీటర్ దూరం పరుగెత్తడం ఖాయం. పాముల్లో ప్రమాదకరమైనవి కింగ్ కోబ్రా, రసైల్ వైపర్..ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఇవి ఒక్క కాటుతోనే ఎలాంటి జీవినైనా చంపేయగలవు.
అనకొండ, కొండచిలువలైతే విషరహితమైనవి కాబట్టి ఇవి మింగడానికి ఇష్టపడతాయి.
కోబ్రా స్నేక్స్ లో.. నాగుపాము, కోడె నాగు, శ్వేత నాగు, గోధుమ నాగు, నీలి నాగు..ఇలానే చాలా రకాలే ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని పాములు రెగ్యూలర్ గా కనబడవు. చాలా అరుదుగా మాత్రమే దర్శనమిస్తాయి. తాజాగా అలాంటి ఓ రేర్ కోబ్రా కనిపించి సందడి చేసింది. అదే బ్లూ కోబ్రా స్నేక్. ప్రస్తుతం దీనిక సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
View this post on Instagram
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ రైతు ఎప్పటిలానే పొలానికి వెళ్తాడు. రోజులానే వ్యవసాయ పనులు చేస్తుండగా..అక్కడ కదులుతున్నట్లు శబ్దం వస్తుంది. తీరా వెళ్లి చూసేసరికి ఆశ్చర్యానికి గురవుతాడు. ఎందుకంటే అతడు చూసింది అత్యంత అరుదుగా కనిపించే బ్లూ స్నేక్. దాని దగ్గరకు వెళ్లగా అది కోపంతో బుసలు కొడుతూ కనిపించింది. దీంతో అక్కడున్న వారు దానిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Also Read: Cobra Snakes lip lock – నాగు పాములు లిప్ లాక్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాముల వీడియోలే దర్శనమిస్తున్నాయి. జనాల్లో వీటిని చూడాలన్న ఆసక్తి పెరగడంతో..రోజుకు వందలకొద్దీ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా వీడియోలే బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వర్షాకాలం నడుస్తుండటంతో పాములు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మా మనవి.


