Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: నీలి రంగు నాలుక ఉన్న వింత జీవిని ఎప్పుడైనా చూశారా?

Viral Video: నీలి రంగు నాలుక ఉన్న వింత జీవిని ఎప్పుడైనా చూశారా?

Strange creature video viral: బ్రహ్మ చేసిన ఈ సృష్టి ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కాలానుగుణంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. మనం ఎన్నో జీవులను చూసి ఉంటాం, కానీ వైరల్ అవుతున్న ఇలాంటి వింత జీవిని ఎప్పుడూ చూసి ఉండం. ఎందుకంటే దీనికి పాము లాంటి నోరు.. నీలి రంగు నాలుక.. బల్లి లాంటి నాలుక ఉంది. తాజాగా ఈ వింత జీవిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

- Advertisement -

ఇలాంటి జీవిని ఎప్పుడూ చూడలేదని కొందరు అంటుంటే.. ఇది అరుదైన బల్లి జాతి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నీలి రంగు నాలుక ఉన్న జీవి ఉంటుందా అని షాక్ అవుతున్నారు. ఈ వీడియోను @TheeDarkCircle అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా..దానిపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంది. 16 సెకన్లు ఉన్న ఈ వీడియోకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ జీవిని రాత్రిపూట చూస్తే హార్ట్ ఎటాక్ రావడం ఖాయమని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తే.. ప్రకృతి దాచిన మరో అద్భుతం ఈ జీవిని మరికొంత మంది అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 

Also Read: Viral Video -ఈ అక్కా టాలెంట్ సూపర్.. కాకులను ఎలా మోసం చేసిందో చూడండి..

ఈ వింత జీవి ఏమిటి?
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వింత జీవి బ్లూ-టాంగ్యుడ్ స్కింక్ అని పిలువబడే బల్లి అని తెలుస్తోంది. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూ గినియాల్లో కనిపిస్తోంది. ఇవి కీటకాలు, పండ్లు, కూరగాయలు, నత్తలు, గొంగళి పురుగులు వంటి వాటిని తిని బతుకుతాయి. దీనికి బలం ఆ నీలి రంగు నాలుక. ఎందుకంటే దీనికి ప్రమాదం వాటిల్లినప్పుడు, వేటాడే జంతువులను భయపెట్టడానికి దాని నీలి రంగు నాలుకను బయట పెట్టి హెచ్చరిస్తుంది. ఈ బల్లులు సుమారు 50-60 సెంటిమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి పగటి పూట చాలా చురుకుగా ఉంటాయి. ఈ బల్లులు రాత్రుళ్లు దొంగలు లేదా ఆకుల కింద ఆశ్రయం పొందుతాయి. దీనిని దూరం చేస్తే పాములాగే ఉంటుంది. మూతి పాములాగా.. బల్లి తోకతో బరువైన శరీరం ఉంటుంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad