Four headed cobra snake Video: టెక్నాలజీ అభివృద్ది చెందడం వల్ల ప్రపంచం చిన్నిదైపోయింది. ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఏఐ అందుబాటులో వచ్చాక ప్రతి ఒక్కరూ రకరకాల ఇమేజ్ లను, వీడియోలను రూపొందిస్తున్నారు. వీటిలో ఏది రియలో, ఏది ఫేక్ వీడియోనో అర్థం కావడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాముల వీడియోలకు పుల్ క్రేజ్ ఏర్పడింది. సర్పాల వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అలాంటి స్నేక్ వీడియోనే ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో ఓ ఇంట్లో నుంచి నాలుగు తలల నాగుపాము బైటకు రావడం చూడొచ్చు. ఈ వింతను చూసి అక్కడున్నవారు అంతా ఆశ్చర్యానికి గురవుతారు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఆ నాగును చూసేందుకు ఎగబడతారు. ఈ అరుదైన నాగుపాము చాలాసేపు పడగ విప్పి అక్కడే ఉండిపోయింది. అయితే ఎవరికి హానీ తలపెట్టలేదు. ఇది ఏఐ వీడియో అని కామెంట్ చేస్తే.. మరికొందరు ఈ పామును చూసి దండం పెట్టుకుంటున్నారు కూడా. మెుత్తానికి ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
వర్షాకాలంలో అడవులు, చెట్లలో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అవి ఇళ్లలో బాత్రూమ్ లోనూ, బెడ్ రూమ్ లోనూ, కిచెన్ లోనూ, బైక్ డిక్కీ లోనూ, బూట్లులోనూ ఎక్కడపడితే అక్కడ నక్కి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. అందుకే మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక వేళ ఏదైనా పాము మీ ఇంట్లోకి దూరిందనే భావిస్తే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి. పొరపాటున పాముకాటుకు గురైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లండి.
Also Read: Viral video- రన్నింగ్ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు.. బాలిక ప్రైవేటు పార్ట్‌లను టచ్ చేస్తూ..


