Saturday, November 15, 2025
Homeవైరల్King Cobra:అరుదైన నాలుగు తలల నాగు పామును ఎప్పుడైనా చూశారా? వీడియో ఇదిగో..

King Cobra:అరుదైన నాలుగు తలల నాగు పామును ఎప్పుడైనా చూశారా? వీడియో ఇదిగో..

Four headed Cobra Snake viral Video: పాముల వీడియోలకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య ఎక్కడా చూసిన సర్పాల వీడియోలే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న పాముల వీడియోల్లో ఏది నిజమో లేదా ఏవీ ఫేకో అర్థం కావడం లేదు.

- Advertisement -

ఏఐ వచ్చాక ప్రతీ వీడియో రియాలిస్టిక్ గానే అనిపిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి కంటెంట్ క్రియేటర్స్ క్రియేట్ చేస్తున్న వీడియోలు అందరికీ షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో నాలుగు తలలపాము కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Also Read: Python Video-కిస్ పెట్టబోతే కొరికేసిన కొండచిలువ.. కట్ చేస్తే..!

పురాణాల్లో భూమండలాన్ని మోసే ఆదిశేషుడికి వెయ్యి తలలు, నాగుల రాజు అయిన వాసుకీ వంద తలలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అది నిజమో కాదు మనకీ ఎవ్వరికీ తెలియదు. అయితే నిజ జీవితంలో రెండు తలల నాగుపాములు, కొండ చిలువలును అయితే చూశాం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా నాలుగు తలల నాగుపామును చూపించారు. ఇది రోడ్డుకు అడ్డంగా నిలబడి పడగవిప్పీ మరి కూర్చుని బుసలు కొట్టడం గమనించవచ్చు.

అయితే ఈ పాము నిజమేనని కొందరు నమ్ముతుంటే.. మరికొందరు ఇది నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. మెుత్తానికి అయితే ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. ఇది నిజమనుకుని నెటిజన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఆలస్యంగా తెలిసిన నిజం ఏంటంటే.. ఇది వాస్తవమైన సర్పం కాదని..ఏఐ జనరేటేడ్ పాము అని తేలింది. ఇది తెలిసి కొందరు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: King Cobra-టాయిలెట్ కమోడ్‌లో భయంకరమైన నాగుపాము.. వీడియో ఇదిగో..!

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad