Three-Headed White Cobra Snake viral video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిత్ర విచిత్ర వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏఐ వచ్చాక ఇది పీక్స్ కు చేరింది. AI వల్ల ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కావడం లేదు. కొన్ని వీడియోలు అయితే మనమే మోసపోయేలా ఇది క్రియేట్ చేస్తోంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టంట హల్ చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ గుడి ప్రాంగణంలో అరుదైన శ్వేతనాగు దర్శనమిచ్చింది. మనం చాలాసార్లు వైట్ కలర్ స్నేక్ చూసి ఉంటాం. కానీ ఇది డిఫరెంట్. ఎందుకంటే ఇది మూడు తలల శ్వేత నాగు. ఈ రేర్ కోబ్రాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ వైరల్ వీడియోను Three-Headed White Cobra అనే టైటిల్ పెట్టి యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇది నిజమైనది కాదని..ఫేక్ వీడియో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా ఒక తల ఉన్న పామును చూసి ఉంటాం. కొన్నిసార్లు జన్యులోపాల వల్ల రెండు తలల పాములు జన్మిస్తాయి. అవి కూడా ఎక్కువ కాలం బతకవు. ఇక మూడు హెడ్స్ స్నేక్ కనిపించడం అంటే దాదాపు అసాధ్యం. అయితే ఏఐ అభివృద్ది చెందాక అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తున్నారు కంటెంట్ క్రియేటర్స్. అప్పట్లో శ్వేత నాగుకు సంబంధించి సినిమా కూడా వచ్చింది. సౌందర్య లీడ్ రోల్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ కూడా అయింది. పురాణాల్లో కూడా శ్వేత నాగు గురించి ప్రస్తావించబడింది.
Also read: Viral Video – రన్నింగ్ ట్రైన్ లో యువతి రచ్చ రచ్చ.. వైరల్ గా మారిన వీడియో..


