Real Cobra Snake wraps around shivling in Temple: దేశవ్యాప్తంగా నాగపంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శివాలయాలు, నాగేంద్రుడు కొవెలలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు నాగేంద్రుడికి పాలు పోసి మెుక్కులు తీర్చుకుంటున్నారు. ఉదయం నుంచి ఉపవాసాన్ని ఆచరిస్తూ ఎంతో నిష్టతో భక్తులు నాగపంచమిని జరుపుకుంటున్నారు. పైగా ఈ రోజున నాగేంద్రుడిని పూజించడం వల్ల కాలసర్ప దోషం నుండి విముక్తి పొందవచ్చు. అయితే ఈ క్రమంలో ఆలయానికి వెళ్లిన ఓ పాము శివలింగానికి గొడుగు మారి బుసలు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాగపంచమి సందర్భంగా ఓ శివాలయంలో భోలాశంకరుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. లింగ రూపంలో ఉన్న ఆ జటాధరుడిని ఆరాధించేందుకు అందరూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఓ భారీ నాగసర్పం శివలింగాన్ని చుట్టుకుని మరీ పడగ విప్పింది. అది చూడటానికి నిజంగా శివుడి మెడలో ధరించిన వాసుకీలా కనిపించింది. అది చూసిన అందరూ నాగేంద్రుడే తమను అశీర్వాదించడానికి వచ్చాడని.. తమ జన్మ ధన్యమైందంటూ ఆ నాగుపాముని చూస్తూ ఉండిపోయారు.
అయితే ఈ శివలింగం దగ్గరకు ఎవరూ వెళ్లడానికి సాహసించలేదు. పాము చాలా సేపు అలానే శివలింగానికి చుట్టుకుని బుసలు కొడుతూ ఉండిపోయింది. ఈ క్రమంలో నాగేంద్రుడికి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నాగ పంచమి వేళ అద్భుతంగా జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. ఇంటర్నెట్ లో మాత్రం ఈ వీడియో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.
Also Read: Nag Panchami – నేడే నాగ పంచమి.. ఈ రోజు ఇలా చేస్తే మీ కాలసర్ప దోషం పోవడం పక్కా!


