Viral video today: కూటి కోసం కోటి విద్యలంటారు పెద్దలు. నిద్రాహారాలు మాని కుటుంబాన్ని పోషించడానికి ఎంతటి కష్టనైనా ఎదిరిస్తారు కొందరు. ప్రాణాలను రిస్క్ చేసి మరి తనవాళ్ల ఆకలిని తీరుస్తారు. బంధం, బాధ్యతల విలువ తెలిసినోడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదిరించి నిలబెడతాడు. అంతేకాకుండా తనవాళ్లకు అండగా నిలుస్తాడు. తాజాగా ఓ వ్యక్తి తన ఫ్యామిలీని పోషించడం కోసం చేస్తున్న పని చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రెండ్ అవుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ కార్మికుడు నిర్మాణం జరుగుతున్న అతి ఎత్తైన బిల్డింగ్ మధ్యలో రాడ్‌లపై నిల్చుని పని చేస్తున్నాడు. అక్కడ నుంచి జారిపడితే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సాధారణంగా మన అంతటి బిల్డింగ్ పైనుంచే కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఆ వ్యక్తి బిల్డింగ్ మధ్యలో రోప్స్ మీద కాళ్లుపెట్టి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నాడంటే అతడి ధైర్యానికి మనం హాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ వీడియోను @RealTofanOjha అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అది కాస్త నెట్టింట ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 40వేల మందికి పైగా వీక్షించారు. వందలాది యూజర్లు లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అతడికి భయమంటే తెలియదని ఒకరంటే..యమధర్మరాజు చుట్టం అయి ఉంటాడని మరొకరు కామెంట్ పెట్టారు. ‘అతడు ప్రమాదంలో లేడు.. అతడే ఒక ప్రమాదం’ అంటూ ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు.
నెట్టింట రోజూ వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి. నిద్రలేచి మెుదలు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో సోషల్ మీడియాను వాడకుండా ఉండరు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, షేర్ చాట్ ఇలా ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వాడుతూనే ఉంటారు. ఇది కొందరికి వినోదాన్ని పంచుతుంటే.. మరికొందరికి డబ్బును కూడా ఇస్తుంది. తమ క్రియేటివిటీతో నెలకు కోట్లు సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు చాలా మంది బానిసలు అయిపోతున్నారు. చదువును, కెరీర్ ను కూడా పణంగా పెట్టి 24 గంటల్లో అందులోనే మునిగితేలుతున్నారు. నేటి యువతలో ఇది వ్యసనంగా మారింది. ఏఐ రాకతో ఇది మరింత ముదిరింది. ఇంటర్నెట్ ను పరిమితంగా వాడాలి అంతేకానీ దానికి బానిస అయిపోకూడదు. ఇలాంటి వాళ్లనే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి పాస్ వర్డ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగిలించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు.