Snake giving birth to baby snakes on road: మనలో చాలా మంది చిన్న చిన్న పాములను చూస్తే దడుచుకుంటారు. అలాంటిది కింగ్ కోబ్రా, కొండ చిలువ, అనకొండ వంటి పాములను చూస్తే ఇంకేమైనా ఉందా అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వేసవిలో తాపం భరించలేక అడవుల్లో సంచరించే సర్పాలు.. వానకాలంలో ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఇళ్లల్లో ఎక్కడపడితే అక్కడ నక్కి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సాధారణంగా పాము గుడ్లను పెట్టడం చూసి ఉంటాం, కానీ ఓ సర్పం గుడ్లను పెట్టకుండా ఏకంగా పిల్లలకే జన్మనిచ్చిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియోలోకి వెళ్తే.. ఇందులో గర్భంతో ఉన్న పాము నడిరోడ్డుపై కనిపిస్తుంది. ఇంతలో అది సడన్ గా పిల్లలకు జన్మనివ్వడం మెుదలుపెడుతుంది. గుడ్ల పెట్టాల్సిన సర్పాలు పిల్లలు కనడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఆ పాము 6 నుంచి 7 పిల్లలను పెట్టింది. ఆ సమయంలో అక్కడున్న జనాలు ఈ అరుదైన దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. రక్తపింజర లాంటి పాములే నేరుగా గుడ్లను పెట్టకుండా పిల్లలను పెడతాయని నిపుణులు అంటున్నారు. సర్పాలు పిల్లలకు జన్మనివ్వడం ఇదే మెుదటిసారి అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం రెయిన్ సీజన్ నడుస్తోంది. వ్యాధులు ఎంత తొందరగా ప్రబలుతాయో.. పాములు కూడా కామన్ గానే ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇవి హౌస్ లో కిచెన్ లోనూ, బెడ్ రూమ్ లోనూ, బాత్రూమ్ లోనూ, షూ ల్లోనో, బైక్స్ డిక్కీల్లోనూ నక్కి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అవి కాటువేసే ప్రమాదం ఉంది. ఒకవేళ పాములు ఇళ్లలోకి నక్కితే వెంటనే స్నేక్ క్యాచర్స్ కు సమాచారం ఇవ్వండి. మీరు పాము కాటుకు గురి అయితే వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ తీసుకోండి. ముందుగా మీరు చేయాల్సింది ఆ పాము విషపూరితమో కాదో నిర్ధారించుకోండి.
Also Read: King Cobra Video -బీరువా లాకర్‌లోకి దూరి.. డబ్బు, బంగారంపై తిష్ట వేసి కూర్చున్న నాగు పాము..


