Rare Snake Laying Eggs Video viral: మనం ఈ మధ్య కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు చాలానే చూశాం. పాములు రొమాన్స్ చేసుకోవడం, మనుషులపై దాడి చేయడం, ఇళ్లలోకి దూరడం, నాగమణిని కలిగి ఉండటం.. ఇలా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తునే ఉన్నాం. కానీ పాములు గుడ్లు పెట్టే వీడియోలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పాము గుడ్లు పెట్టడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా కోళ్లు, బాతులు గుడ్లు పెట్టడం చూసి ఉంటాం. కానీ పాములు గుడ్లు పెట్టడం పెద్దగా ఎవరూ చూసి ఉండరు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ తల్లిపాము ఎంతో ఓపికతో గుడ్లును పెడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. రేర్ గా కనిపించే ఇలాంటి వీడియోను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. జీవ వైవిధ్యంలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా వారు వర్ణిస్తున్నారు. అంతేకాకుండా నలుగురికి ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై జంతుప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ప్రకృతి సమతుల్యతకు నిదర్శమని వారు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో సర్పాల వీడియోలను చూసేందుకు జనాలు మక్కువ చూపుతున్నారు. దాంతో రోజూ వందలాది వీడియోలు నెట్టింట పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలను వీక్షించేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. దానికి తగ్గట్టే క్రియేటర్స్ కూడా అలాంటి వీడియోలనే ఎక్కువగా డంప్ చేస్తున్నారు. వాటిల్లో కాస్త విచిత్రంగా లేదా వింతగా ఉన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్య నాగమణులకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Viral Video-ఇదేం పైత్యం రా బాబు! బెడ్ రూమ్ లో పాములను పెంచుతున్న యువతి.. వైరల్ గా వీడియో..
Also Read: Giri nagu video – ఇళ్ల సందులో భారీ గిరి నాగు.. అతడు జస్ట్ లో మిస్ ..లేకపోతే అంతే!


