Teacher viral video: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను ఏదో విధంగా చూపించాలనుకుంటున్నారు. కొంత మంది రీల్స్ రూపంలో తమ ప్రతిభను బయటపడతే.. ఇంకొందరు షార్ ఫిల్మ్స్ చేసి ఫేమస్ అవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా ఇవి వైరల్ అయి కొంత మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట రోజూ లక్షల కొద్దీ పుట్టుకొస్తున్నాయి. ఇందులో నెటిజన్స్ ను ఆకట్టుకునే వీడియోలు కొన్నే ఉంటాయి. అలాంటి వీడియోల్లో తాజాగా వైరల్ అవుతున్న టీచర్ వీడియో ఒకటి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
పిల్లలను పౌరులగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత. ఈ క్రమంలో వారు బోధనతోపాటు వివిధ కళల్లో ప్రావీణ్యం సంపాదించేలా పిల్లలను తీర్చిదిద్దుతారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు డ్యాన్స్ నేర్పుతున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో టీచర్ విద్యార్థులు చేత నృత్యం చేయించడమే కాకుండా తను కూడా అదిరిపోయే స్టెప్స్ వేసి అలరించాడు. ఆ టీచర్ డ్యాన్స్ కు అక్కడ ఉన్నవారంతా ఫిదా అయ్యారు. ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా చేయడం అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది.
అయితే టీచర్ వేసినట్లే అమ్మాయిలు కూడా అదిరిపోయ్ డ్యాన్స్ స్టెప్పులు వేసి అలరించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కోరిక ఇవాళ తీరినట్లు ఆ ఉపాధ్యాయుడు ముఖం వెలిగిపోతుంది. విద్యార్థులతో కలిసి టీచర్ డ్యాన్స్ వేయడాన్ని అక్కడున్న కొందరు స్టూడెంట్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై లైక్స్ , కామెంట్స్ వర్షం కురుస్తుంది. టీచర్ డ్యాన్స్ స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయని కొందరు.. ఇలాంటి టీచర్ మాకు ఉంటే గొప్ప డ్యాన్సర్స్ అయ్యేవాళ్లమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Read: viral video-బైక్ పై రొమాంటిక్ స్టంట్.. ప్రేమ జంటకు రూ. 50 వేల ఫైన్..


