King cobra Trending Video: మన రాజులు, పూర్వీకులు నిధికి కాపలాగా పాములను వశీకరణ చేసి కాపలాగా పెట్టేవారమని విన్నాం. ఈ ఆధునిక కాలంలో కూడా కొంత మంది గుప్త నిధులు తవ్వుతున్నప్పుడు సర్పాలు అడ్డుపడటం చూశాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. మూడు నాగు పాములు పడగవిప్పీ మరి డబ్బులకు కాపలా కాయడం చూడవచ్చు. ఆ డబ్బును తీసుకోవడానికి ప్రయత్నించేవారిపై ఆ పాములు బుసులు కొడుతూ కాటువేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి చూడటానికి చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. పాములు ఇంత వైలెంట్ గా ఉండటం చూసి నెటిజన్స్ ఆశ్యర్యపోతున్నారు. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
వర్షాకాలంలో పాములు అటవీ ప్రాంతాల్లో నుండి దగ్గరలో ఉన్న ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇవి ఇంట్లో ఏది మూలన నక్కి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా బాత్రూమ్స్ లో, బెడ్ రూమ్ లో, కిచెన్ లో, బైక్స్ లో, షూ ల్లో పాములు దాక్కుంటాయి. మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న అవి కాటు వేయడం ఖాయం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు చాలా కేర్ పుల్ గా ఉండాలి. ఒక వేళ పాము మిమ్మల్ని కాటువేస్తే దగ్గరలోని ఆస్పత్రిని సందర్శించండి. సర్పాలు ఇంట్లోకి దూరితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి.
Also read: Viral Video – ఇంట్లోకి దూరిన భయంకరమైన పాము.. ఈ బుడ్డది ఎలా బయటకు పంపించిందో చూశారా?
సోషల్ మీడియాలో పాముల వీడియోలకు మంచి ఆదరణ లభిస్తుంది. వీటిని చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే కంటెంట్ క్రియేటర్స్ కూడా భారీ సంఖ్యలో సర్పాల వీడియోలను డంప్ చేస్తున్నారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా, కొండ చిలువ, అనకొండలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.


