Three Headed King Cobra Video Viral: ఇటీవల కాలంలో అరుదైన పాము జాతులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. మనం ఎప్పుడూ చూడని పాములు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సాధారణంగా ఒక్క తల ఉన్న పామునే చూస్తేనే వణుకుతాం. అలాంటిది ఇటీవల కాలంలో రెండు తలలు ఉన్న సర్పాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంతకుమించి ఒక పాము వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఇందులో ఓ నాగుపాము మూడు తలలతో కనిపిస్తుంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ట్రైబ్ షార్టర్ అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికిపైగా వీక్షించారు. ఆరు సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను చూసి చాలా మంది జంతు ప్రేమికులు షాక్ అవుతున్నారు.
ఒకే పాముకు ఎక్కువ తలలు ఉండటాన్ని బైసెఫాలిక్ లేదా పాలిసెఫాలీ అంటారు. జన్యులోపం కారణంగా ఇలా ఓకే సర్పానికి వివిధ తలలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి పాములు ఉండవని.. ఇది గ్రాఫిక్స్ అని కొందరు, ఏఐ వీడియో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఈ మూడు తలలపాము గుడిలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పురాణాల్లో ఇలాంటి పాములు ఉండేవని పండితులు చెబుతున్నారు. ఈ భూమండలాన్ని మోసే ఆదిశేషుడికి వెయ్యి తలలు, నాగులకు రాజు అయిన వాసుకీకి వంద తలలు ఉండేవని పురాణ కథనం. తక్షకుడు, కర్కోటకుడు, అనంత తదితర పాములకు కూడా మరికొన్ని తలలు ఉండేవని పండితులు అంటున్నారు. మానవులు కూడా కొన్ని సందర్భాల్లో రెండు తలలు అంటుకుని జన్మించడం చూసే ఉంటాం. అలానే పాములు కూడా కొన్ని తలలతో పుడతాయి. సోషల్ మీడియా వచ్చాక వింతైనా విషయం కూడా నార్మల్ గానే కనిపిస్తోంది. ప్యూచర్ లో ఇంకెన్నో విచిత్రాలు చూడాల్సి వస్తుందో.
Also Read: Viral Video – పాము పిల్లలను పెట్టడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో..


