Mother Slapping Daughter in train: కన్న రుణానికి పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు తప్పటడుగులు వేస్తే సరిదిద్దాల్సింది వారే. కన్న బిడ్డల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన వాళ్లు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు వారు ఎలాంటి పనులు చేస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కొంత మంది పేరెంట్స్ ఏది మంచో, ఏది చెడో పిల్లలకు వివరించే ప్రయత్నం చేస్తారు. మరికొందరు తప్పుదారిలో పయనిస్తున్న బిడ్డలను మందలించైనా సరే దారిలో పెడతారు.
అయితే సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. రీల్స్ మోజులో పడి ప్రమాదకరమని తెలిసిన సరే లెక్కచేయకుండా స్టంట్స్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. నడుస్తున్న రైలులో తలుపు దగ్గర నిలబడి ఓ యువతి రీల్స్ చేస్తుండగా.. అది చూసిన తల్లి వచ్చి చితకబాదింది. ఈ ఫన్నీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. మీరు చూసేయండి.
View this post on Instagram
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఒక అమ్మాయి డోర్ వద్ద నిలబడి రీల్ చేస్తూ ఉంటుంది. దానిని ఓ యువకుడు వీడియో తీస్తాడు. స్పీడ్ గా వెళ్తున్న రైలులో ఆ యువతి ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అదే సమయంలో ఆమె తల్లి అక్కడికి వచ్చి చూస్తుంది. రీల్స్ చేస్తున్న కూతురును వెనక్కి లాగి పొట్టుపొట్టున కొడుతోంది. అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
ఈ వీడియో mr_rahul_razz అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను మిలియన్స్ మంది వీక్షించారు. తల్లి చేసిన పనిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. కూతురు తప్పటడుగు వేయకుండా తల్లి తీసుకున్న ఈ చర్య ప్రతి పేరెంట్స్ కు చెంపపట్టు ఉంటుంది.


