Wednesday, July 16, 2025
Homeవైరల్Trending: హరిహర కోటకు పోటెత్తుతున్న ట్రెక్కర్స్..ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

Trending: హరిహర కోటకు పోటెత్తుతున్న ట్రెక్కర్స్..ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

Harihar Fort overcrowded as trekkers: ట్రెక్కింగ్ ప్రేమికులకు స్వర్గధామం హరిహర కోట. నిత్యం పర్యాటకులతో కళకళ్లాడుతూ ఉంటుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ఈ చారిత్రక కోటను హర్షగఢ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫోర్ట్ సహ్యాద్రి పర్వతశ్రేణిలో భాగంగా సముద్రమట్టానికి 3,676 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కోటపై చేరుకోవడానికి నిలువుగా రాతిమెట్లు ఉంటాయి. ఈ మెట్ల ద్వారానే కొండశిఖరానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇది సవాల్ తో కూడుకున్న పని.

- Advertisement -

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఫేమస్ పర్యాటక ప్రదేశాల్లో రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా ముస్సోరి, లాండౌర్, హరిహరకోట వంటి ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తుతున్నారు. తాజాగా హరిహార ఫోర్ట్ కు వందలాది మంది సందర్శకులు చేరుకున్నారు. ఇరుకైన రాతిమెట్ల మార్గంలో ఒకరి వెనుకలా ఒకరు నిలబడ్డారు. ఇక్కడ ఏ చిన్నపాటి తొక్కిసలాట జరిగినా లేదా ఎవరైనా నియంత్రణ కోల్పోయినా భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ భయానక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను 8లక్షల మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా ఈ దృశ్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ట్రెక్కింగ్ చేసే డేంజరస్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ కోటను యాదవ రాజులు నిర్మించారు. ఇది త్రిభుజాకారపు రాతిపై నిర్మించబడింది. దాని చుట్టూ పొడవైన గోడ దర్శనమిస్తుంది. సాధారణంగా కొండపైకి చేరుకోవడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతుంది. వర్షాకాలంలో కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడకు వెళ్లాలనుకునేవారు ముందుగా నాసిక్ చేరుకోవాలి. అక్కడ నుంచి మీరు ఘోటి లేదా ఇగత్ పురి చేరుకుని.. ఆటో లేదా టాక్సీలో నిర్గుడ్ పాడ అనే గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుంచి కోటపైకి చేరుకోవాలంటే 2-3 గంటలు నడవాల్సి ఉంటుంది.

ఇటీవల 18 సంవత్సరాల నిరీక్షిణ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లు అభిమానులతో కలిసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో ఓ విషాద సంఘటన జరిగింది. వేలాది మంది ఒక్కసారిగా స్డేడియంలో దూసుకురావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనే మరొకటి జరగడానికి సిద్ధంగా ఉందని ఎక్స్ వేదికగా నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News