UP Couple viral video: ఇటీవల కాలంలో యువత చేస్తున్న చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియా మోజులో పడి వారు చేస్తున్న పనులు పిచ్చికి పరాకాష్టగా మారుతున్నాయి. రీల్స్, లైక్స్ కోసం యూత్ చేస్తున్న డేంజరస్ స్టంట్ లు వారి ప్రాణాలనే మాత్రమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాయి. వీరు చేస్తున్న వికృత చేష్టలు నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి.
తాజాగా యూపీలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తూ నడిరోడ్డుపై బైక్ పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. అమ్మాయిని పెట్రోల్ ట్యాంకర్ పై కూర్చోపెట్టుకుని వేగంగా బైక్ నడుపుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా వీడియో ట్రెండ్ అవడంతో నోయిడా పోలీసులు ఆ జంటకు షాకిస్తూ రూ.53, 500 జరిమానా విధించారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ మధ్య కుర్రకారు అమ్మాయిలను బైక్ మీద కూర్చొబెట్టుకుని ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తించడం ఫ్యాషన్ గా మారిపోయింది. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రేమికులు ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై అబ్బాయిలు, అమ్మాయిలు చేస్తున్న పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ప్రేమ పేరుతో యువత చేస్తున్న చేష్టలు వారి తల్లిదండ్రులనే కాదు ఇతరులను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఇలాంటి చర్యల పట్ల పోలీసులు, అధికారులు కఠిన శిక్షలు వేయాలి, లేకపోతే మళ్లీ మళ్లీ యువత ఇలాంటి పనులకే పాల్పడతారు. మీ కళ్ల ముందు ఎవరైనా ఇలా చేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి.
Also Read: Viral Video -అడ్మిషన్ కోసం స్కూల్‌కు వెళ్లిన గున్న ఏనుగు.. ట్రెండింగ్ లో వీడియో..


