Snake Buy Food Video viral: సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక స్నేక్ వీడియో వైరల్ అవుతూనే ఉంది. సర్పాల వీడియోలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా పెద్ద మెుత్తంలో పాముల వీడియోలను ఇంటర్నెట్ లో డంప్ చేస్తున్నారు. అందులో కాస్త డిఫరెంట్ గా వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఓ నగరంలోని రోడ్డు పక్కన ఓ వ్యాపారి చీకులు కాలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడకు ఓ ప్రమాదకరమైన కింగ్ కోబ్రా వస్తుంది. అది దాదాపు పది అడుగులపైనే ఉంటుంది. అది చీకుల వైపు చూస్తూ బుసలు కొడుతూ ఉంటుంది. అయితే అక్కడున్న వారు ఏ మాత్రం భయపడకుండా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. చిన్న పోయ్యిపై చీకులు కాల్చడం అక్కడున్న పాము తదేకంగా చూస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ దృశ్యాన్ని గమనించిన కొంతమంది స్థానికులు వీడియోగా రికార్డు చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆహార వాసనకే ఆ పాము అక్కడకు వచ్చిందని కొందరు.. నిజంగా అది వాస్తమైన పాము కాదని మరికొందరు.. పుడ్ కొనుగోలు చేయడానికి వచ్చిందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Read: viral video -వామ్మో.. టాయిలెట్ ట్యాంక్ కింద వందల కొద్దీ పాములు..వైరల్ గా వీడియో..
ఈ భూమ్మిద విషపూరితమైన జీవి ఏదైనా ఉందంటే అది పాము. అన్ని సర్పాలు విషపూరితం కాదు. ఇందులో కొన్ని జాతులు మాత్రమే ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. కింగ్ కోబ్రా, రస్సెల్ వైపర్ వంటి పాముల్లో అధికంగా విషం ఉంటుంది. ఇవి ఒక్క కాటుతోనే ఎలాంటి జంతువునైనా చంపగలవు. అందుకే పాము కరిచినా వెంటనే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే ఆస్పత్రిని సందర్శించండి.


