Saturday, November 15, 2025
Homeవైరల్Rare Snake video: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న నాగుపామును ఎప్పుడైనా చూశారా?

Rare Snake video: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న నాగుపామును ఎప్పుడైనా చూశారా?

Venomous Cobra Snake Hood Shining Video: ప్రకృతి ఎన్నో వింతలకు, విశేషాలకు నిలయం. మనకు కంటికి కనిపించని ఎన్నో రహస్యాలు ఈ సృష్టిలో దాగి ఉన్నాయి. ఈ మధ్య పాములకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనం కొన్ని రకాల సర్పాలనే చూసుంటాం. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వివిధ జాతులకు చెందిన పాములను చూడాల్సి వస్తుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ నాగుపాము పడగవిప్పి ఉండటం మీరు గమనించవచ్చు. అయితే ఈ పాము మిగతా సర్పాలకు భిన్నంగా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఈ వింత పామును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సూర్యుడి కాంతి ఆ పాము పడగపై పడటం వల్లే ఆ సర్పం అలా మెరిసిపోతుందని తెలుస్తోంది. అయితే ఇలాంటి పాములే శక్తివంతమైన నాగమణులను కలిగి ఉంటాయని నెటిజన్స్ భావిస్తున్నారు. జన్యుపరమైన మార్పులు కారణంగానే పాము పడగ భాగం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్ లో అడవుల్లో ఉండాల్సిన సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. అంతేకాకుండా ఇవి ఇళ్లలోకి దూరి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాములు ఇళ్లలో బెడ్ రూమ్ లోనూ, బాత్రూమ్ లోనూ, కిచెన్ లోనూ, బైక్ డిక్కీల్లోనూ ఎక్కడపడితే అక్కడ నక్కి ప్రజల ప్రాణాలు తీసే అవకాశం ఉంది. ఏదైనా పాము మీ ఇంట్లో నక్కితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి, కాటు వేస్తే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లండి.

Also Read: Four Headed Snake – లైవ్ లో దర్శనమిచ్చిన నాలుగు తలల దేవతా సర్పం.. ఒళ్లు జలదరించే వీడియో ఇదిగో..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad