Saturday, November 15, 2025
Homeవైరల్Watch video: విమానంలో ఇంధన స్విచ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇదిగో వీడియో..

Watch video: విమానంలో ఇంధన స్విచ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇదిగో వీడియో..

How B787 fuel switches work: అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానంలోని ఇంధన స్విచ్‌లు రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్ లోకి వెళ్లడమే ఇందుకు కారణమని రిపోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంధన స్విచ్‌లు ఎలా పనిచేస్తాయనే దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

సాధారణంగా విమాన ఇంజిన్ల ప్యూయల్ సరఫరాను ఇంధన స్విచ్‌లు కంట్రోల్ చేస్తాయి. ఇవి రన్ మరియు కటాఫ్ మోడ్ లో ఉంటాయి. వీటిని విమానం స్టార్ట్ చేయడానికి, ఆపడానికి ఉపయోగిస్తారు. ఈ స్విచ్ లను ఇష్టమెుచ్చినట్లు మార్చే వీలుండదు. దీనికో ప్రోసీజర్ ఉంటుంది. తొలుత స్విచ్ లను ముందుగా లాగా.. ఆ తర్వాత పైకి గానీ లేదా కిందకు గానీ నెట్టాలి.

ఇదే విషయాన్ని వీడియోలో స్పష్టంగా వివరించారు. ఇందులో రన్ నుంచి కటాఫ్ కు, కటాఫ్ నుంచి రన్ కు వెళ్లడం చూపించారు. ఈ వీడియోను బట్టి చూస్తే ఒక సెకనులో ఇంజిన్‌ను ఆపడం అసాధ్యమని తెలుస్తోంది. అయితే దర్యాప్తు సంస్థ సమర్పించిన రిపోర్టులో రెండు ఇంజిన్లు కటాఫ్ మోడ్ లోకి వెళ్లడానికి మధ్య సమయం ఒక సెకనుగా చెప్పారు.

ఆహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానంలోని ఇంధన స్విచ్ లలో ఎలాంటి సమస్యలు లేవని బోయింగ్ కంపెనీ స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా ఆ స్విచ్ లను 2019, 2023లో రీప్లేస్ చేసిందని సంస్థ పేర్కొంది. ప్రతి 24 వేల గంటల ప్రయాణం తర్వాత వాటిని మారుస్తామని తెలిపింది. ఆ స్విచ్లు అంత ఈజీగా రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్ కు వెల్లవని.. దీనికి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాలూ కారణమై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరి ఆ స్విచ్ లు కటాఫ్ మోడ్ లోకి ఎలా వెళ్లాయనేది తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad