Nagamani Rare Video Viral: నాగమణి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నాగమణిని ధరిస్తే అద్భుత శక్తులు వస్తాయని, మనం ఏది అనుకుంటే అది జరుగుతుందని, ఇది వజ్రం కంటే విలువైనదని, దివ్యత్వం వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిని ఒక అరుదైన రత్నంగా మాత్రమే భావిస్తారు. ఒకప్పుడు ఈ నాగమణులు గురించి పాములను విచక్షణారహితంగా హతమార్చేవారు. అయితే నాగమణికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ వ్యక్తి రాత్రిపూట బయట సంచరిస్తూ ఉంటే అతడికి ఓ వెలుగు కనిపిస్తుంది. ఆ కాంతి ఎక్కడ నుండి వస్తుందా అని అతడు వెళ్లి చూస్తాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు. అక్కడ ఓ నాగమణి దివ్యకాంతులతో వెలిగిపోవడం చూస్తాడు. అంతేకాకుండా ఆ విలువైన రత్నానిక ఒక భారీ నాగసర్పం కాపలా కాయడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ పాము చూడటానికి చాలా భయంకరంగా ఉంది. పెద్దగా పడగా విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. ఆ మెుత్తం దృశ్యాన్ని అతడు భయపడుతూనే ఫోన్ లో రికార్డు చేస్తాడు. దానిని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అరుదైన నాగులు మాత్రమే నాగమణిని ధరిస్తాయని.. ఇవి దేవతల వరప్రసాదమని పురాణాలు చెబుతున్నాయి. అయితే పాముల్లో రసాయన ప్రక్రియ జరిగి ఇలాంటి రత్నాలు ఏర్పడతాయని..అవి రాత్రిపూట మెరుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సాధారణంగా పాము తలపై భాగంలో నాగమణిని మనం చూస్తూ ఉంటాం. నాగమణులు చాలా రంగుల్లో ఉంటాయని తెలుస్తోంది. కొన్ని ఆకుపచ్చ కలర్ లో, మరికొన్ని తెలుపు రంగులో, ఇంకొన్ని లేత పసుపు రంగులో ఉంటాయట. పాములకు దైవత్వం ఉందని నిజమని భావిస్తే.. ఈ నాగమణులకు కూడా అతీత శక్తులు ఉన్నాయని నమ్మాల్సి ఉంటుంది. ఏది ఏమైనా తాజా వీడియోతో మరోసారి నాగమణి వార్తల్లో నిలిచింది.


