Wife beats husband in bangladesh court video viral: బంగ్లాదేశ్ కోర్టులో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కోర్టు రూమ్ యుద్ధవాతావరణాన్ని తలపించింది. న్యాయస్థానంలో భార్యభర్తల రభస అందరినీ షాక్ కు గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఏదో ఒక విషయంపై భార్యభర్తలు కోర్టుకు వచ్చారు. ఆకస్మాత్తుగా ఆ మహిళ తన భర్తపై దాడికి తెగబడింది. ఏం జరిగిందో తెలియదు కానీ కోపంతో ఊగిపోయిన ఆమె నలుగురు చూస్తారనేది పట్టించుకోకుండా భర్తను గట్టిగా చెంపదెబ్బ కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అతడి జట్టు పట్టుకుని లాగింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే భార్య కొడుతున్నప్పుడు భర్త నవ్వుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తనకు కొత్తేమీ కాదని.. రోజూ ఇంట్లో తన్నుల తినడం కామనే అన్నట్టు భర్త చూడటం కనిపిస్తుంది.
కోర్టు వంటి ప్రదేశంలో ఓ మహిళ తన భర్త పట్ల ఇంత కర్కశత్వాన్ని ప్రదర్శించడం సరైన పద్దతి కాదని వీడియో చూసిన వారు అంటున్నారు. న్యాయం ఆశించి కోర్టుకు వచ్చిన భర్తకు భార్య ఇలా తన చేతితో శిక్ష విధించడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను @gharkekalesh అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా..అది కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోను లక్షలాది మంది లైక్ చేయగా.. చాలా మంది తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Anaconda viral video-ఇంత పెద్ద అనకొండను మీరెప్పుడైనా చూశారా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీ కోసం..
కోర్టు ఆవరణలో భర్తను కొట్టడం సరైన పద్దతి కాదని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అన్యాయం జరిగిందని కోర్టు గడప తొక్కి తీరా మీరే ఇలా ప్రవరిస్తే ఎలా అని ఇంకొందరు అంటున్నారు. అసలు ఆ భార్యభర్తలు కోర్టుకు ఎందుకు వచ్చారనేది తెలియరాలేదు.
Also Read: ChatGPT – ChatGPTని గుడ్డిగా నమ్మి.. హాస్పిటల్ పాలయ్యాడు!


