woman brutally attacks Husband: ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. టెక్నాలజీ వచ్చాక ప్రపంచం చిన్నిదైపోయింది. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. నెట్టింట ఈ మధ్య జంతువులు, మనుషుల చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా భార్యభర్తలకు చెందిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
వీడియో ఓపెన్ చేస్తే.. ఢిల్లీలోని రోడ్డుపై ఇద్దరు దంపతులు బైక్ మీద వెళ్తూ ఉంటారు. వారి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.. భార్య రెచ్చిపోయి భర్తపై పిడిగుద్దులు కురిపించింది. అతడు బైక్ నడుపుతున్నాడనే సోయా కూడా లేకుండా పొట్టలో గిల్లుతూ, తలపై కొడుతూ చుక్కలు చూపించింది. బైక్ ఎక్కడ అదుపు తప్పుతుందోనని ఆ వ్యక్తి టెన్షన్ పడటం వీడియోలో చూడొచ్చు. కానీ ఆమె మాత్రం ఎక్కడ తగ్గకుండా అతడిని కొడుతూనే ఉంది. వీరి చేష్టలను చూసి వెనుకాల వస్తున్న కొందరు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై కొంత మంది ఫన్నీగా కామెంట్ చేస్తే.. మరికొందరు మండిపడుతున్నారు.
Also read: Shocking Video -చూస్తుండగానే అమ్మాయిలా మారిపోయిన నాగుపాము.. షాకింగ్ వీడియో మీ కోసం..
రీసెంట్ గా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలోని మీరట్ లో చోటుచేసుకుంది. నగరంలోని ఎండీఏ కార్యాలయం ఎదుట ఉన్నట్లుండి కారులో నుంచి దిగిన భార్య..భర్తపై పిడిగుద్దులు కురిపించింది. అంతేకాకుండా బుతూలు తిడుతూ వీరంగం సృష్టించింది. ఇంతా జరుగుతున్న చుట్టపక్కల వారు కనీసం వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. అందరూ సినిమా చూసినట్లు చూస్తూ ఉండిపోయారు. అంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవ ఆపి ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే గొడవకు గల కారణాలేంటో తెలియరాలేదు. గత నెలలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.


