Extramarital affair video viral: ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య బంధానికి విలువ లేకుండా పోతుంది. ఏ చిన్న గొడవ వచ్చినా విడాకులు తీసుకోవడమో లేదా వేరొక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడమో చేస్తున్నారు. ఒకప్పుడు అలుమగలు మధ్య ఎలాంటి వివాదాలు వచ్చినా పెద్దలు సర్ది చెప్పి ఒకటి చేసేవారు. ఇప్పుడు అలా కాదు ఎవరికీ వారే గొప్ప అనుకుంటున్నారు. సోషల్ మీడియా మోజులో పడి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమో లేదా ఇతరుల ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. హర్యానాలోని జింద్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ కు ఒక వ్యక్తి వెళ్తాడు. అయితే అతడు తన భార్య వేరొకరితో రూమ్ లో ఉండటం గుర్తిస్తాడు. అతడిని రాకేష్ గా గుర్తించారు. ఇతడి వెంట కొంత మంది వ్యక్తులు ఉంటారు. అయితే వెంటనే రాకేష్ హోటల్ రిసెప్షన్ వద్దకు వెళ్లి తన భార్య గది నంబర్ అడిగి తెలుసుకుంటాడు. తన భార్య ఉన్న గది వద్దకు వెళ్లి డోర్ తెరవమని పదే పదే కొడతాడు. ఆ సమయంలో అతడిలో తీవ్రమైన మనోవేదన కనిపించింది.
గది తెలుపు తెరిచిన తర్వాత లోపల అతని భార్య వేరొక వ్యక్తితో కనిపించింది. కోపంతో ఊగిపోయిన రాకేష్ అందరికీ స్పష్టంగా కనిపించేలా లైట్లు వేయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో భార్య ప్రియుడిని కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తన భర్తను దూరంగా నెట్టి వేయడం వీడియోలో కనిపిస్తుంది. అయితే రాకేశ్ గొంతులో తెలియని బాధ, నైరాశ్యం కనిపించాయి. నా జీవితం నాశనం అయిపోయిందంటూ రాకేశ్ చెప్పిన మాటలు మనకు వినిపిస్తాయి.
Also Read: King Cobra Video -బీరువా లాకర్‌లోకి దూరి.. డబ్బు, బంగారంపై తిష్ట వేసి కూర్చున్న నాగు పాము..
ఈ మెుత్తం తతంగాన్ని అక్కడున్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు పోలీసులకు చెప్పిన నీ భార్యే నీపై రివర్స్ లో కేసు పెట్టి నిన్ను జైలుకే పంపే అవకాశం ఉందని ఒకరు కామెంట్ చేస్తే.. ఈ కాలంలో పెళ్లి అనే పవిత్రమైన బంధానికి విలువ లేకుండా పోయిందని మరోకరు రాసుకొచ్చారు.


