Thursday, July 10, 2025
Homeవైరల్Viral: రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్ చల్, వీడియో వైరల్

Viral: రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్ చల్, వీడియో వైరల్

Woman drives car on railway tracks: మనలో చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలని పిచ్చిపిచ్చి పనులు చేస్తుంటారు. వీరి చేసే పనులు కొన్నిసార్లు ప్రజలకు, ప్రభుత్వానికి కూడా తలనొప్పి తెచ్చిపెడతాయి. ఇలాంటి తుంటరి పనే చేసింది తెలంగాణకు చెందిన ఓ యువతి. రీల్స్ మోజులో పడి ఆ అమ్మాయి డేంజరస్ స్టంట్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఆమె ఏ స్టంట్ చేసింది? తన వల్ల పబ్లిక్ ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

- Advertisement -

సోషల్ మీడియా వచ్చాక అందులో ఎలాగోలా సెలిబ్రిటీ అయిపోవాలని యువత తెగ ఉవ్విళ్లూరుతోంది. దానికి అనుగుణంగానే వారి చేష్టలు కూడా వింతగా ఉంటున్నాయి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఫేమస్ అయిపోవచ్చని అనుకుంటున్నారు. వారి చేసే పనులు వల్ల ఇతరులు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి కూడా అలాగే స్టార్ అయిపోవాలని రోడ్డు మీద పోనివ్వాల్సిన కారును రైలు పట్టాలపై ఎక్కించి నడిపింది. దీంతో అధికారులతో సహా అక్కడున్నవారందరూ షాక్ కు గురయ్యారు.

రైల్వే అధికారులు ఎంత చెప్పిన వారి మాట వినకుండా ఆమె పట్టాల మీద డ్రైవ్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలోని రైలు పట్టాలపై దాదాపు 8కి.మీ దూరం వెళ్లింది. స్థానికులను ఆమెను ఆపే ప్రయత్నం చేయబోతే వారిని కత్తితో బెదిరించి రచ్చ రచ్చ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయి తాగి ఈ స్టంట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఆమె చేసిన ఈ పని వల్ల ఆ మార్గంలో రైళ్లన్నీ గంటల తరబడి ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News