Goats on Escalator Adventure: సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైరల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు షాకింగ్ గురిచేస్తే.. మరికొన్ని ఫన్నీగా ఉంటున్నాయి. మనుషులు కానీ, జంతువులకానీ కాస్త డిఫరెంట్ గా ఏది చేసినా అది ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇలాంటివి చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ మహిళ ఏకంగా మేకలను ఎస్కలేటర్ ఎక్కించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సాధారణంగా ఎస్కలేటర్స్ ను రైల్వే స్టేషన్లలోనూ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ చూస్తుంటాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలా భయపడతారు. కామన్ గా ఇవీ సిటీస్ లో ఉంటాయి. గ్రామాల నుంచి వచ్చినవారిలో చాలా మందికి ఇదొక వింతలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఓ మహిళ తాను ఎక్కడమే కాదు..ఏకంగా తన మేకల్ని సైతం ఎస్కలేటర్ పైకి ఎక్కించింది. అవి రాననుంటున్న సరే బలవంతంగా దానిపైకి లాక్కెళ్లింది. ఆమె చేసిన పనికి చుట్టుపక్కల ఉన్నవారు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
మనలో చాలా మంది ఏదోలా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు. డిఫరెంట్ గా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒక్కోసారి వీళ్లు ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. అయితే పాపులారిటీ పెంచుకోవాలనే మోజులో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఓ పిల్లవాడు రీల్స్ కోసం వెళ్లే రైలు కింద పడుకున్నాడు. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు, కొంచెం తేడా వచ్చినా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలంటే అందరికీ సాధ్యం కాదు. కొందరికీ మాత్రమే ఆ లక్ ఉంటుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని రీల్స్ కోసం బలి చేసుకోకండి. వీలైతే మీ కెరీర్ దృష్టి పెట్టి.. అందులో విజయవంతమవ్వడానికి ప్రయత్నించండి.


