Sunday, November 16, 2025
Homeవైరల్Viral Video: ఈ అక్కా టాలెంట్ సూపర్.. కాకులను ఎలా మోసం చేసిందో చూడండి..

Viral Video: ఈ అక్కా టాలెంట్ సూపర్.. కాకులను ఎలా మోసం చేసిందో చూడండి..

woman imitates crows: ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. దానిని బయటకు తీసినప్పుడే మన సక్సెస్ మెుదలవుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకున్నారు. వారి చేసిన రీల్ వైరల్ అయితే రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతున్నారు. తాజాగా ఓ యువతి టాలెంట్ చూసి సోషల్ మీడియా షేక్ అవుతోంది.

- Advertisement -

ప్రస్తుతం పితృ పక్షం నడుస్తోంది. ఈ పదిహేను రోజులు పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేయడంతోపాటు పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అయితే మనం పెట్టిన పిండాల్ని కాకులు ముట్టుకుంటేనే పితృదేవతలు సంతోషిస్తారు. ఒక వేళ కాకులు రాకపోతే వాటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ మహిళ చేసిన పని తెగ నచ్చేస్తుంది. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటో తెలుసా?

తాజాగా ఈ యువతి తన మిమిక్రీతో మనుషులనే కాదు కాకులను కూడా బురిడీ కొట్టించింది. ఆమె కాకిలా అరుస్తూ అనేక కాకుల్ని తమవైపుకు తిప్పుకుంది. ఓ మహిళ ఎప్పటిలానే ఇంటి డాబాపైకి వెళ్లింది. అప్పుడు అక్కడ ఒక్క కాకి కూడా లేదు. కానీ ఆమె తన వాయిస్ ను మార్చి కాకిలా అరవడంతో కొన్ని సెకన్లలోనే పదుల సంఖ్యలో కాకులు అక్కడకు వచ్చేశాయి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఆమె అచ్చం కాకిలానే అరవడంతో తమ గుంపులోని కాకికి ఏమైందోనని పదుల సంఖ్యలో కాకులు అక్కడకు వచ్చాయి. దీంతో అక్కడున్న వారి దీనిని వీడియోగా తీసి @GurmeetBha53034 అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను వందల మంది లైక్ చేయగా.. వేల మంది వీక్షించారు. నీ టాలెంట్ సూపర్ అని కొందరు.. కాకులా సిస్టర్ లా ఉన్నావని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Also Read: Viral video- ఓరేయ్ నాయనా.. అది ట్రైన్ రా.. ఓయో కాదురా? రన్నింగ్ ట్రైన్‌లో ముద్దులు, హగ్స్ తో రెచ్చిపోయిన ప్రేమ జంట..

రోజూ ఎన్నో వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇంకొన్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అంతా కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. కొంత మంది నెట్టింట ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేయడానికి సిద్దమవుతున్నారు. రీల్స్ మోజులో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad