Woman fighting for seat video: ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు బస్సులు, ట్రైన్స్ లో కొట్లాటకు దిగుతున్నారు. సీట్ కోసం జుట్టు పీక్కుని మరీ కొట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా ఓ యువతి ట్రైన్ లో రచ్చ రచ్చ చేసింది. సీటు కోసం ఓ అమ్మాయి, కొంత మంది యువకులతో గొడవకు దిగింది. పై బెర్త్ నుంచి లేచి మరీ ఇష్టమెుచ్చినట్లు కొట్టింది. అంతేకాకుంతా కాలితో కూడా తన్నుతూ రచ్చరంబోలా చేసింది. ఎంత మంది ఆపిన ఆ యువతి వెనక్కి తగ్గలేదు. వాగ్వాదం పీక్స్ కు చేరిన సమయంలో కొంత మంది సీక్రెట్ గా ఈ మెుత్తం తతంగాన్ని వీడియోగా తీసి పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇంత బరితెగించి బట్టలు చింపుకుని గొడవలు పడుతున్నారేంట్రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో యువతీ యువకులు చేష్టలు హద్దులు దాటుతున్నాయి. రైళ్లలోనే అన్నీ కానించేస్తున్నారు. వాష్ రూమ్ లోనే రొమాన్స్ కు దిగుతూ రచ్చ చేస్తున్నారు. మరోవైపు ట్రైన్ సీట్స్ లోనే ముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా వారు ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. యువత తమ కోరికలు అదుపులో ఉంచుకోకుండా నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు అందరిలో చేయడం నిజంగా సిగ్గు చేటు అనే చెప్పాలి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: Shocking video -ముక్కుతో బీర్ తాగడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో..


