World’s longest and most poisonous snake video: ఈ భూప్రపంచంలో ప్రమాదకరమైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. ఇవి సాధారణంగా 20 అడుగుల వరకు పెరుగుతాయి. అలాంటి కింగ్ కోబ్రాల పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఓ యువకుడు ఏమాత్రం భయపడకుండా 18 అడుగుల మలేషియన్ కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
వీడియోలోకి వెళ్తే.. ఈ భూమ్మీద అత్యంత పొడవైన, డేంజరస్ విషం కలిగిన మలేషియన్ కింగ్ కోబ్రాను ఓ యువకుడు చేతితో పైకి లేపడం చూడవచ్చు. 17 అడుగుల నుండి 18 అడుగుల (5 మీ) కలిగిన ఈ కింగ్ కోబ్రాను పట్టుకోవడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో Nature is Amazing ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అలా పామును పట్టుకోవడం చాలా ప్రమాదకరమని, అది అతడి ప్రాణాలకే ముప్పు తెస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఆ యువకుడు దైర్యానికి హ్యాటాఫ్ చెబుతున్నారు.
కింగ్ కోబ్రా విషపూరితమైనవి కాకుండా బాగా తెలివితేటలు కలిగినవి కూడా. ఇది కాటువేసిందంటే ఏనుగైనా చనిపోవాల్సిందే. ఇది ఇతర పాములను కూడా తింటుంది. అందుకే దీనిని పాముల రారాజుగా పిలుస్తారు. తాజా వీడియోలో చూపించిన మలేషియా కింగ్ కోబ్రా విషం చాలా శక్తివంతమైనది. అది కొన్ని గంటల్లోనే పెద్ద ఏనుగును కూడా చంపగలదు. అయితే ఇవి అంత తేలికగా మనుషులపై దాడి చేయవు. దానికి ఆపద కలిగినప్పుడు మాత్రమే కాటు వేయడానికి చూస్తాయి. ఆడ కింగ్ కోబ్రా కూడా తన గుడ్లను రక్షించుకోవడానికి దూకుడుగా ప్రవర్తిస్తుంది.
Also Read: King Cobras – ఓరి దేవుడా! ఒకే చోట ఇన్ని నాగుపాములా..!
మలేషియా కింగ్ కోబ్రా ద్వీపకల్పం మరియు తూర్పు మలేషియాలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 5-6 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. కింగ్ కోబ్రాలకు సిగ్గు ఎక్కువ. బెదిరింపులకు గురైనప్పుడు మాత్రమే అవి పైకి లేచి పడగ విప్పి బుసలు కొడతాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: ChatGPT – ChatGPTని గుడ్డిగా నమ్మి.. హాస్పిటల్ పాలయ్యాడు!


