Man playing with hundreds of cobra snakes: మనలో చాలా మంది చిన్న పామును చూస్తేనే హడలిపోతారు. అదే నాగుపాము కనబడితే వెన్నులో వణుకు పడుతుంది. అలాంటిది కొన్ని వందల పాములు మనల్ని చుట్టుముడితే ఇంకేమైనా ఉందా.. మన ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిపిపోతాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక గ్రీన్ మేట మీద వందలాది నాగుపాములు ఉంటాయి. ఇవన్నీ పడగవిప్పి బుసలు కొడుతూ ఉండటం వీడియోలో చూడవచ్చు. అంతలో అక్కడికి ఓ యువకుడు వస్తాడు. అతడు పాముల ముందు పడుకుని వాటి కళ్లలో చూస్తూ ఉంటాడు. ముందు భయం భయంగా వాటికి ముందుకు వెళ్లిన ఆ యువకుడు తర్వాత సెటిల్ గా కూర్చుని ఆ పాములతో ఆడుకోవడం మెుదలపెడతాడు. కొన్ని సర్పాలు ఆ కుర్రాడిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఏ మాత్రం బెదిరిపోకుండా అక్కడే ఉంటాడు. అలా కొంత సేపు వాటితో గడుపుతాడు.
అక్కడున్న కొందరు దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏం గుండెరా వాడిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతడు స్నేక్ క్యాచర్ లేదో తెలియదు కానీ అతడు చూపిన తెగువకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా పాములతో వ్యవహారించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.
Also read: Viral Video -ఓ పక్క గణేశుడి మెడలో నాగుపాము.. మరో పక్క వినాయకుడి ఒడిలో హాయిగా నిద్రపోతున్న పిల్లి..
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పాములు వరద ద్వారా కొట్టుకు వచ్చి ఇళ్లలోకి దూరుతున్నాయి. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అవి కాటు వేసే ప్రమాదం ఉంది. మీ ఇంట్లోకి ఏదైనా పాము దూరితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి. ఒక వేళ అది మిమ్మల్ని కాటువేస్తే సొంత వైద్యం చేసుకోకుండా దగ్గరలోని ఆస్పత్రిని సందర్శించండి.
Also Read: Viral video- వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఇళ్లు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు..


