Saturday, November 15, 2025
Homeవైరల్Taj Mahal: తాజ్ మహల్ పై విమానాలు ఎగరక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

Taj Mahal: తాజ్ మహల్ పై విమానాలు ఎగరక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

- Advertisement -

Airplanes don’t fly over Agra’s Taj Mahal: ప్రపంచంలోని 7 వింతలలో తాజ్ మహల్ ఒకటి. ప్రేమకు ప్రతీకగా నిలిచే ఈ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు. ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ అద్భుతమైన స్మారక చిహ్నాన్ని 1631 మరియు 1648 మధ్య నిర్మించారు.

ఆగ్రాలో యమునా నది ఒడ్డున నిర్మించిన తాజ్ మహల్ 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది పర్షియన్, భారతీయ, ముస్లిం నిర్మాణ శైలుల మిశ్రమం. దీని సందర్శించేందుకు దేశ విదేశాల నుండి రోజూ లక్షల మంది వస్తారు. ప్రేమకు ప్రతిరూపంగా భావించే తాజ్ మహల్ పై విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దీనికి కారణం ఏమిటో తెలుసా?

కారణం ఇదే..

1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాజ్ మహల్‌ను ప్రకటించినప్పటి నుంచి దాని మీదుగా విమానాలను నిషేధించారు. దాని చుట్టూ ఉన్న దాదాపు 7 కిలోమీటర్ల వరకు ఇది వర్తిస్తుంది. తాజ్ మహల్ సందర్శించే పర్యాటకుల భద్రత దృష్ట్యా 2006లో దీనిని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. తాజ్ మహల్ చుట్టూ ఉండే రద్దీ, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇతర నో-ఫ్లై జోన్లు..

అదేవిధంగా దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనం మరియు ప్రధానమంత్రి అధికారిక నివాసం కూడా నో-ఫ్లై జోన్ల పరిధిలోకి వస్తాయి. భద్రతా కారణాల దృష్టిలో ఉంచుకుని..ముంబైలోని టవర్ ఆఫ్ సైలెన్స్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు మధుర రిఫైనరీని కూడా నో-ఫ్లై జోన్లుగా గుర్తించారు. అంతేకాకుండా తిరుమల వెంకటేశ్వర ఆలయం, కేరళలోని పద్మనాభస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మరియు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం మీదుగా ఏ ప్రైవేట్ లేదా వాణిజ్య విమానాలు ప్రయాణించవు.

Also Read: Viral video – అద్భుతం.. బంగారు నిధికి కాపలాగా దేవ నాగు.. వీడియో వైరల్..

నో ఫ్లై జోన్క అంటే?

నో-ఫ్లై జోన్ అనేది గగనతలంపై పరిమితం చేయబడిన ప్రాంతం. భద్రతా కారణాల దృష్ట్యా ప్రైవేట్, వాణిజ్య లేదా సైనిక విమానాలు ఎగరడానికి అనుమతించబడవు.

Also Read: Shocking Video – కోర్టులో భర్తను కుల్లబొడిసిన భార్య.. వైరల్ గా మారిన వీడియో..

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad