Woman Breaks Train AC Coach Window: రైలు ప్రయాణాల్లో దొంగతనాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు రైల్వే సిబ్బంది సైతం తగు జాగ్రత్తలు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. లగేజ్‌ను భద్రంగా చూసుకోవాలని.. విండో సీటు దగ్గర కూర్చున్నప్పుడు సెల్‌ఫోన్ చూడటం లేదా పర్సు పట్టుకోవడం లాంటివి చేయవద్దని.. ఖరీదైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఒకవేళ కదులుతున్న రైలులో ఇలాంటి దొంగతనాలు జరిగితే ప్రయాణికులు.. చేసేదేం లేక మౌనంగా బాధపడుతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం అలా చేయలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: https://teluguprabha.net/viral/bjp-mp-ganesh-singh-attack-on-crane-operator-video/
న్యూఢిల్లీలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా.. ఆమె పర్సు చోరీకి గురైంది. దీంతో ఆ మహిళ రైల్వే సిబ్బందితో పాటు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఎవరూ స్పందించకపోవండో ఆ మహిళ ఆగ్రహించింది. రైల్వేతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఊహించని పనికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైలులో తను కూర్చున్న సీట్లోనే తన బిడ్డ పక్కన ఉండగానే ఏసీ కోచ్ విండోను పగులగొట్టింది. దీంతో అద్దం ముక్కలు అక్కడ చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ సంఘటనను అదే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ఒకరు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైరల్ అవుతోంది. ఆ మహిళ తీరుపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
మహిళ తన పక్కనే ఉన్న పిల్లవాడి భద్రత గురించి ఆమె పట్టించుకోకపోవడాన్ని కొందరు విమర్శించారు. గాజు ముక్కలు ఆ చిన్నారిపై పడితే పరిస్థితి ఏంటని దుయ్యబట్టారు. మరికొందరు ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సంఘటనపై రైల్వే ఇంకా స్పందించలేదు.
A woman broke a train window just because she lost her purse
And these are the same kinds of women who keep blaming the government every day for "bad facilities" and "poor infrastructure" pic.twitter.com/WVoM1MKP5T
— Saffron Chargers (@SaffronChargers) October 29, 2025


