Woman Brushes in Bus: తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంలో ఓ మహిళ చేసిన పని నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. పబ్లిక్ ప్లేస్‌లో ఇదేం పని అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: https://teluguprabha.net/gallery/allu-sirish-nayanika-wedding-photos/
తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్రీ బస్సు స్కీంతో మహిళలకు, ముఖ్యంగా నిరుపేద మహిళలకు, రోజువారీ కూలీ చేసుకునే వారికి ప్రయాణ ఖర్చు డబ్బులు మిగలడంతో ఆర్థికంగా వారికి చాలా ఊరట లభించింది. మరోవైపు సొంతంగా చాలా మంది మహిళలు చిరు వ్యాపారాలు సైతం చేసుకోగలుగుతున్నారు. ఇవన్నీ ఒక వైపు అయితే.. ఈ పథకం అమల్లోకి వచ్చాక కొందరు మహిళలు చేసే పనులు వింతగా ఉంటున్నాయి. వారి చేష్టలు నవ్వు పుట్టించడమే కాకుండా, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా ఎలా చేయగలుగుతున్నారంటూ వారిపై కొంచెం చిరాకు కూడా వస్తుందనడంలో సందేహం లేదు.
ఇప్పటివరకూ ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు సిగ పట్లు పట్టడం, కొట్టుకోవడం, దూషించుకోవడం చూశాం. ఇంకా ఇంట్లో తీరిక లేక బస్సులో జర్నీ చేస్తూ వెల్లుల్లి పొట్టు తీసుకోవడం, లేదంటే ఫ్రీ టికెట్ కదా అని టైం పాస్ కోసం తెలిసిన వారి ఇళ్లకి వెళ్లడం ఇలా చూశాం. కానీ ఈ సారి వెరైటీగా ఓ మహిళ.. బస్సులోనే సీట్లో కూర్చుని బ్రష్ చేస్తూ జర్నీ చేస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
టూత్ పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడంతో తోటి ప్రయాణికులు ఒకింత ఇబ్బందులుపడ్డారు. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ సంకల్పంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మహిళలు ఇలా దుర్వినియోగం చేసుకోవడం సరికాదంటూ హితవు పలికారు. ఫ్రీ బస్సు స్కీంను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

