Rapido rider: రాపిడో రైడర్‌కు ఇచ్చే రూ.100లను ఎగ్గొటేందుకు ఓ మహిళ నడిరోడ్డుపై చేసిన హంగామా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బైక్ రైడ్ ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోగా అడిగినందుకు రాపిడో రైడర్‌ను బూతులు తిట్టింది. అంతేకాకుండా రైడర్‌పై వేధింపుల కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగింది.
అసభ్య పదజాలంతో దూషించిన మహిళ: బాధిత రాపిడో రైడర్ తన మొబైల్‌లో రికార్డ్ చేసిన వివరాల ప్రకారం.. సదరు మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకున్న గమ్యస్థానానికి చేరుకున్నాక రైడర్‌కు ఇవ్వాల్సిన రూ.100 ఛార్జీని ఇవ్వడానికి నిరాకరించింది. రైడర్ తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరగా.. ఆమె ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది. అతడిని నడిరోడ్డుపై అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించింది. అంతటితో ఆగకుండా ఎక్కువగా మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేసి నీపై మహిళా వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించడం ప్రారంభించింది.
Also Read-Viral: హైదరాబాద్‌లో వింత పూజలు.. భర్త ఎఫైర్స్ బ్రేక్ కావాలని భార్య పూజలు!
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం: ఆమె ఉద్దేశపూర్వకంగానే గొడవ చేస్తూ డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి జారుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన రాపిడో రైడర్.. ఆమె అకారణంగా తిడుతున్న బూతులను తన మొబైల్ ఫోన్‌లో సాక్ష్యంతో సహా రికార్డ్ చేశాడు. “డబ్బులు ఇవ్వకుండా నన్ను ఎందుకు తిడుతున్నారు?” అని ప్రశ్నించాడు. అయినా వినకుండా ఆమె నడుచుకుంటూ పారిపోతుండటంతో రైడర్ ఆమెను వెంబడించాడు. “నువ్వు తప్పు చేయనప్పుడు పోలీస్ స్టేషన్‌కు రా.. అక్కడే తేల్చుకుందాం” అంటూ రాపిడో రైడర్ డిమాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించుకునే డ్రైవర్లపై మహిళా కార్డు ఉపయోగించి ఇలాంటి తప్పుడు బెదిరింపులకు దిగడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని అమాయకులను వేధించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

