pizza delivery boy struggle video viral: స్కూల్ రోజుల్లో క్లాస్ టాపర్.. అందరికీ స్ఫూర్తినిచ్చే మేధావి.. భవిష్యత్తులో ఏదో అయిపోతాడని టీచర్లు, స్నేహితులు ఆశపడ్డ కుర్రాడు. కానీ కాలం అందరికీ ఒకేలా ఉండదు కదా? అనుకోని పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు అతని కలల కంటే ముందే తలుపు తట్టాయి. చేతిలో పెన్ను పట్టాల్సిన వాడు, ఇంటి బాధ్యత కోసం పిజ్జా బాక్సు పట్టుకున్నాడు.
ఒకరోజు పిజ్జా డెలివరీ ఇస్తూ తన పాత క్లాస్‌మేట్‌కు ఎదురుపడ్డాడు. ఆమె అతన్ని చూడగానే పలకరించి ధైర్యం చెప్పాల్సింది పోయి, వెంటనే ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. నవ్వుతూ.. ఎగతాళి చేస్తూ.. “స్కూల్లో అందరినీ ఇన్‌స్పైర్ చేసేవాడివి కదా.. ఇంత చదువు చదివి ఇప్పుడు పిజ్జాలు డెలివరీ చేస్తున్నావా?” అంటూ వెటకారం చేసింది. ఆ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తానంటూ హేళనగా నవ్వింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Snake video -పిల్లాడా లేక పాముల మంత్రగాడా? భారీ పామును ఒంటిచేత్తో పట్టుకుని..
ఎగతాళి చేయడం సంస్కారం కాదు
ఆ యువతి ప్రవర్తనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. కానీ ఒక మనిషి కష్టాన్ని, పరిస్థితులను అర్థం చేసుకోకుండా అవమానించడం నిజమైన సిగ్గుచేటు. ఒక పురుషుడు తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి, ఎండనక, వాననక రోడ్ల మీద తిరుగుతున్నాడంటే దాని వెనుక ఒక తల్లి మందుల ఖర్చో, చెల్లి పెళ్లి చదువు ఖర్చో లేక ఇంటి అద్దెనో దాగి ఉంటుంది. ఒక మనిషి ఏ పని చేస్తున్నాడో చూసి తక్కువ చేయకండి. అతను ఏ పరిస్థితుల్లో ఆ పని చేస్తున్నాడో ఆలోచించండి. మగవాడిగా పుట్టడం అంటే కేవలం సంపాదించడం కాదు.. తన సంతోషాన్ని బలి ఇచ్చి తన వాళ్ళ కోసం బతకడం.

