Saturday, November 15, 2025
Homeవైరల్Carrie Edwards: లాటరీలో రూ.కోటి గెలుచుకున్న మహిళ.. ఆ మొత్తాన్ని ఏం చేసిందో తెలుసా!

Carrie Edwards: లాటరీలో రూ.కోటి గెలుచుకున్న మహిళ.. ఆ మొత్తాన్ని ఏం చేసిందో తెలుసా!

woman showed humanity: అదృష్టం అనేది ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరి మాత్రమే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తనకు వరించిన అదృష్టంతో మానవత్వాన్ని చాటుకుంది.

- Advertisement -

సుమారు రూ. 1.3 కోట్లు: వర్జీనియాకు చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ అనే మహిళకు అదృష్టం వరించింది. ఆమెకు ఏకంగా రూ.కోటి లాటరీ గెలిచుకుంది. అయితే ఆమె ఆ మొత్తాన్ని తన కోసం కాకుండా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ షాక్ అయ్యారు. క్యారీ ఎడ్వర్డ్స్ సెప్టెంబర్ 8న వర్జీనియా లాటరీలో $150,000 గెలుచుకున్నారు. చాలా మంది అదృష్టం కొద్ది లాటరీ గెలిస్తే తమ సొంతానికి వాడుకుంటారు. వాటితో వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వాడుకుంటారు. కానీ మాత్రం క్యారీ తన లాటరీ డబ్బు మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తాను గెలిచిన వెంటనే తీసుకున్నానని ఆమె చెప్పారు.

Also Read:https://teluguprabha.net/viral/son-fulfills-mothers-dream-skydiving/

భర్త స్టీవ్ గౌరవార్థం: ఈ $150,000 బహుమతిని క్యారీ 3 స్వచ్ఛంద సంస్థలకు చెరో $50,000 చొప్పున అందించారు. ఆమె మొదటి విరాళాన్ని “అసోసియేషన్ ఫర్ ఫ్రంటోటెంపోరల్ డిజనరేషన్ ” అనే సంస్థకు ఇస్తున్నట్లుగా తెలిపారు. ఇది ఆమె చనిపోయిన భర్త స్టీవ్ గౌరవార్థం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆమె భర్త స్టీవ్ కూడా ఇదే వ్యాధితో బాధపడ్డ అంశాన్ని గుర్తు చేసుకున్నారు. 2వ విరాళాన్ని రిచ్‌మండ్‌లోని “షాలమ్ ఫార్మ్స్” అనే ఛారిటబుల్ సంస్థకు క్వారీ ఇచ్చారు. ఆమె స్వయంగా ఈ సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తారు. 3వ విరాళాన్ని “నేవీ-మెరైన్ కార్ప్స్ రిలీఫ్ సొసైటీ”కి క్వారీ ఇచ్చారు. ఈ సంస్థ అనేది సైనిక కుటుంబాలకు ఆర్థిక, విద్యా సంబంధ సహాయం అందిస్తుంది.

సమాజంలో మంచి మార్పు కోసమే: తాను దేవుని దయతో ఆ డబ్బు గెలుచుకున్నానని క్యారీ ఎడ్వర్డ్స్ అన్నార. అందుకే దానిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించానని అన్నారు. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. లాటరీ గెలిచినవారు సైతం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని ఆమె ఈ కథతో నిరూపించారని పలువురు అన్నారు. దీంతో తాను చేసిన ఈ దాతృత్వం సమాజంలో మంచి మార్పు తీసుకొస్తుందని క్వారీ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad