Woman Throws stone at Running Train: కదులుతున్న రైలులో డోర్ వద్ద నిలబడి ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: https://teluguprabha.net/viral/children-cleaning-classroom-in-chhatarpur-govt-school-viral-video/
కదులుతున్న రైలులో డోర్ వద్ద నిలబడిన ఓ మహిళ.. ఆ పక్కన పట్టాలపై ఎదురుగా మరొక లోకల్ ట్రైన్ హై స్పీడ్‌తో వెళ్తోంది. ఇంతలోనే ఆ మహిళ తన చేతిలో రాయిని నేరుగా లోకో పైలట్ సీటు వైపు విసిరింది. అంటే ఆ రాయి నేరుగా ట్రైన్ ముందుభాగంలోని విండ్‌షీల్డ్‌కి తాకింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం మాత్రం అందుబాటులో లేదు. కొందరు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
కాగా, మహిళ చేసిన పని ప్రమాదకరమని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పని చట్టవిరుద్ధమని నెటిజన్లు మండిపడుతున్నారు. పొరపాటున ఆ రాయి ప్రయాణికుడికి గానీ, రైలు అద్దానికి కానీ తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


