Gold Shop Owner Attack on Woman: చీరలు, బంగారు దుకాణాల్లో సిబ్బంది కళ్లు గప్పి కొందరు మహిళలు చాకచక్యంగా ఖరీదైన చీరలు, నగలు దోచుకెళ్లడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. మాల్స్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లు ఉన్న సరే.. ఏ మాత్రం భయం లేకుండా చాలా తెలివిగా కొంగు చాటున పెట్టుకుని చోరీ చేస్తుంటారు. ఇక్కడ కూడా అలాగే ఓ గోల్డ్ షాపులో చోరీకి యత్నించిన మహిళను.. చితకబాది తగిన రీతిలో బుద్ధి చెప్పాడు ఓ యజమాని.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/viral/railway-catering-staff-attack-on-passengers-viral-video/
ఇటీవల కర్ణాటకలో ఓ మహిళ ఓ శారీ దుకాణంలో కాస్ట్లీ చీరల కట్టను దొంగిలించింది. సీసీ కెమెరాల ద్వారా ఆమెను గుర్తించిన యజమాని.. అదే ఏరియాలోకి మళ్లీ ఆ మహిళ వచ్చినప్పుడు కనిపెట్టారు. ఆమెను రోడ్డుపైనే తీవ్రంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేసింది. తాజాగా గుజరాత్‌లోనూ అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బంగారం దుకాణంలో చోరీకి యత్నించింది మహిళ. షాపులో యజమాని తప్ప ఎవరూ లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన మహిళ.. తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేయబోయింది. కానీ ఊహించని విధంగా ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే..
Also Read: https://teluguprabha.net/viral/woman-molested-in-moving-bus-video-goes-viral-on-social-media/
అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో ఉన్న బంగారం దుకాణంలో యజమాని సోని కౌంటర్ దగ్గరే కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఓ మహిళ దుకాణంలోకి వచ్చికూర్చుంది. ఆ షాపులో ఆమె, యజమాని తప్ప మరెవరూ లేరు. ఇదే అదునుగా భావించిన మహిళ.. ఓనర్‌ను మాటల్లో పెట్టింది. చోరీ చేసేందుకు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. అతడి కళ్లలోకి కారం కొట్టేందుకు ప్రయత్నించింది. గమనించిన సోనీ.. వెంటనే అలర్ట్ అయి ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
ఇక ఆమె తప్పించుకునే వీలు లేకుండా వెంటనే ఆమెను పట్టుకుని చితకబాదాడు. షాపులోకి వచ్చి కళ్లలో కారం కొట్టి దొంగతనం చేస్తావా అంటూ.. విపరీతంగా ఆమెపై దాడి చేశాడు. అనంతరం దుకాణం నుంచి బయటకు తరిమేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డు కావడంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలంటూ ట్వీట్ చేస్తున్నారు. యజమాని సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఈ ఘటనపై వీడియో ఆధారంగా రాణిప్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
મહિલાએ આંખમાં મરચું નાખ્યું, સોનીએ 25 સેકન્ડમાં 20 લાફા ઝીંક્યા, જુઓ CCTV#ahmedabadnews #ranip #ranipgoldstore #robbery #viralvideo #viralnews #ahmedabadcrime pic.twitter.com/ddwXUjWPFU
— Dinesh Chaudhary (@DineshNews_) November 6, 2025


