Sanitary Pads Fungus Viral Video: కొత్త శానిటరీ ప్యాడ్స్‌లో ప్రమాదకర ఫంగస్ ఉందంటూ గత కొన్ని రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వీడియోను సవాల్ చేస్తూ ఓ యువతి ఆ అంశంపై పరిశోధన చేశారు. నిజంగానే కొత్త శానిటరీ ప్యాడ్స్ లోపల బ్యాక్టీరియల్ ఫంగస్ ఉందా అని పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
సాధారణ వెలుతురులో శానిటరీ ప్యాడ్స్ నీట్‌గా కనిపిస్తోంది. అయితే లైటింగ్‌కు దగ్గరి తీసుకొచ్చాక వాటిలో డర్టీ కలర్ కనిపిస్తోందంటూ కొన్ని రోజులుగా పలు వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీనిపై చాలా మంది ఆందోళన చాలా వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని అసురక్షితంగా భావించారు. వీటిని వాడటం వల్ల గర్భాశయ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయని ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలను ఓ యువతి ఖండించింది.
Also Read: https://teluguprabha.net/viral/found-fungus-in-sanitary-pads-viral-video/
కొత్త శానిటరీ ప్యాడ్‌ను తీసుకుని సెల్ఫీ వీడియో తీస్తూ ఆ యువతి టెస్ట్ చేసింది. ప్యాడ్‌ను లేయర్స్‌గా విడదీస్తూ ఒక్కో లేయర్‌ను పరీక్షించింది. మొత్తం నాలుగు లేయర్లలో మూడు లేయర్లు నీట్‌గా ఉండగా.. ఒక లేయర్ పసుపు కలర్‌లో కనిపిస్తోంది. అయితే ఆ పొర ఆ రంగులో కనిపించడానికి గల కారణాలపై ఆమె విశ్లేషణ చేసింది. శానిటరీ ప్యాడ్స్‌లో మొత్తంగా ప్యూర్ కాటన్ మాత్రమే వినియోగించరని.. అందులో కొంత భాగం సెల్యులోజ్ పల్ప్ ఉపయోగించడం కారణంగా పసుపు కలర్‌లో కనిపించే అవకాశాలున్నాయని వెల్లడించింది.
శానిటరీ ప్యాడ్స్ లోపల డిఫరెంట్ కలర్ కనిపించిన మాత్రాన.. అది అసురక్షితం కాదని గుర్తుంచుకోవాలని మహిళలకు ఆమె సూచించారు. అయితే ఏ కంపెనీ కూడా ప్యాడ్స్ తయారీలో ఉపయోగించే ప్రొడక్టులపై వివరాలు ఇవ్వాలని లేదని ఆమె తెలిపింది. కానీ వాటి గురించి తెలుసుకునే హక్కు మనకి ఉందని సూచించింది. కాగా, శానిటరీ ప్యాడ్స్‌తో ఇబ్బందులు ఎదురవతాయని భావించే వారు.. పీరియడ్ ప్యాంటీస్ లేదా మెన్‌స్ట్రువల్ కప్స్‌ను ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/viral/btech-student-spot-died-while-doing-bike-stunt/
ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు చాలా కాలంగా తాము కప్స్ వాడుతున్నామని.. వాటితో ఏ ఇబ్బందీ లేదని వెల్లడించారు.


