Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: ఖరీదైన కారులో వచ్చి హోటల్‌ బిల్లు కట్టకుండా పారిపోయేందుకు యువతుల యత్నం.. చివరికి.!  

Viral Video: ఖరీదైన కారులో వచ్చి హోటల్‌ బిల్లు కట్టకుండా పారిపోయేందుకు యువతుల యత్నం.. చివరికి.!  

Women Ate food and escaped without paying the bill: హోటల్‌లో ఫుల్లుగా ఫుడ్‌ తిని బిల్లు కట్టకుండా హీరో హీరోయిన్లు పారిపోవడం సినిమాల్లో  చూస్తుంటాం. అది మనకి చూడటానికి కామెడీగా అనిపించినా.. నిజ జీవితంలో ఇలా జరిగితే మాత్రం సదరు హోటల్‌ యజమానిపై, అందులో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా, రాజస్థాన్‌లోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కానీ ఇక్కడ సిబ్బంది వారిని వదల్లేదు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/young-man-suicide-attempt-from-hi-tension-tower-viral-video/

రాజస్థాన్‌లోని మౌంట్‌ అబు సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు గుజరాత్‌కు చెందిన ఐదుగురు అమ్మాయిలు ఖరీదైన కారులో వచ్చారు. కాస్ట్లీ ఫుడ్‌ ఆర్డర్‌ చేసి కడుపు నిండా ఆరగించారు. తీరా బిల్లు చూశాక రూ. 10,900 అయింది. బిల్లు చూసి ఖంగు తిన్న యువతులు.. చేతిలో అంత డబ్బు లేకపోయేసరికి బిల్లు ఎగ్గొంట్టేందుకు ప్లాన్‌ చేశారు. అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ వేశారు.

ఈ క్రమంలో టాయిలెట్‌ వెళ్తానని చెప్పి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా రెస్టారెంట్‌ నుంచి బయటకు తప్పించుకున్నారు. అనంతరం కారులో పారిపోయేందుకు యత్నించగా.. ఇంతలోనే ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. వీళ్ల వ్యవహారాన్ని ముందు నుంచి గమనిస్తున్న హోటల్‌ యజమాని, వెయిటర్ వాళ్లను పోలీసుల సాయంతో వెంబడించారు. గుజరాత్- రాజస్థాన్ సరిహద్దు అంబాజీ వైపు వాళ్ల కారు వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nara-lokesh-tet-sc-verdict-review-petition-ap-teachers-oct-2025/

అక్కడికి చేరుకున్న హోటల్‌ సిబ్బంది, పోలీసులు అమ్మాయిలను అరెస్టు చేశారు. బిల్లు కట్టాలని డిమాండ్‌ చేయడంతో ఇక చేసేదేం లేక ఆ యువతులు తమ స్నేహితుడికి ఫోన్ చేసి చేసి అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. అనంతరం ఆ డబ్బుతో చివరికి బిల్లు కట్టారు. 

ఈ సంఘటన అంతా రోడ్డుపై జరగడంతో అక్కడున్న వారు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో 10 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఆ అమ్మాయిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంస్కారహీనమైన పనులు చేయడం సరికాదంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad