Women Fight for Seat in RTC Bus Viral Video: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. టైం పాస్ కోసం మహిళలు బంధువుల ఇళ్లకు వెళ్లడం, బస్సులో కూర్చుని వెల్లుల్లి రెబ్బలు తీయడం వంటివి చూశాం. ఇంకాస్త ముందుకెళితే.. సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మేమేం తక్కువ కాదంటూ మహిళలు సీట్ల కోసం తమ ప్రతాపాలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/viral/female-passenger-argue-with-driver-in-jaggaiahpet-rtc-bus/
పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరం నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్లు ఫుల్‌గా ఉండటంతో మహిళలు నిల్చుని ఉన్నారు. కాసేపయ్యాక ఆ సీటు ఖాళీ కావడంతో దాని కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ గొడవ కాస్త కొట్లాటకు దారి తీసింది. ఓ మహిళ మరో మహిళను జుట్టు పట్టుకుని దాడి చేసింది. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ మరింత తీవ్రంగా మారింది.
జరుగుతున్న గొడవను ఆపే ప్రయత్నం చేయకుండా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆడవాళ్ల గొడవలో తలదూర్చడం ఎందుకు అనుకున్నాడో ఏమో డ్రైవర్ కూడా ఆ చోద్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.


