Viral Video Woman Delivery in Local Train: ఆ యువకుడు డాక్టర్ కాదు. మెడిసిన్ చదవలేదు. వైద్యశాస్త్రం గురించి గోరంతే తెలుసు. కానీ గర్భిణీకి డెలివరీ చేయాలంటే గైనకాలజిస్ట్ అయి ఉండాలి. దానిపై అవగాహన ఉండాలి. ఇవేమీ తెలియకపోయినా.. కళ్లముందు పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను చూసి ఊరకనే ఉండలేకపోయాడు. సాయం చేయాలన్న తపనతో, సాంకేతికతను ఆధారంగా చేసుకుని వైద్యుల సలహా మేరకు మహిళకు పురుడు పోశాడు.
లోకల్ ట్రైన్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి సాయం చేసి పురుడు పోశాడు ఓ యువకుడు. పబ్లిక్ ప్లేస్‌లో ఎవరూ సాయం చేయకపోయినా.. ముందుకొచ్చి ధైర్యం చేశాడు. ఆ మహిళకు డెలివరీ చేసి పండంటి బిడ్డను అందించాడు. ముంబయి లోకల్ ట్రైన్‌లో చోటుచేసుకున్న ఈ అరుదైన సంఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/viral/crane-pre-wedding-shoot-instagram-reel-went-viral-in-social-media/
గోరేగావ్ రైల్వే స్టేషన్ నుంచి ముంబయి వైపు లోకల్ ట్రైన్‌లో నెలలు నిండిన గర్భిణీ ప్రయాణిస్తోంది. రాత్రి సుమారం 12.40 గం. సమయం. జర్నీలో ఉండగానే ఉన్నట్లుండి ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు మొదలయ్యాయి. సాయం చేయమని అరుస్తున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. అప్పుడు, అదే కంపార్ట్‌మెంట్‌లో ఉన్న వికాస్ దిలీప్ బెడ్రే అనే యువకుడు స్పందించి ముందుకు వచ్చాడు. వెంటనే లోకల్ ట్రైన్ ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రామ్ మందిర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది.
When a hospital failed a mother in labor, a hero at Ram Mandir station stepped up. Pulling the train’s emergency chain, he saved her & her baby with a doctor’s virtual help. This is what humanity looks like—act when it counts. #RealHeroes #SaveLives pic.twitter.com/1mbOpryDS9
— ಸನಾತನ (@sanatan_kannada) October 16, 2025
అయితే ఓ వైపు ఆ రైల్వే స్టేషన్‌లో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. మరోవైపు చూస్తేనేమో ఆ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతోంది. వికాస్ బెడ్రేకు ఎలాంటి వైద్య అనుభవం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వికాస్ బెడ్రే వెంటనే డాక్టర్ దేవికా దేశ్‌ముఖ్‌కు వీడియో కాల్ చేశాడు. చదువుకున్న వ్యక్తి కావడంతో డాక్టర్ చెప్పిన సూచనల మేరకు ఆ మహిళకు సాయం చేశాడు. దీంతో ఆమె సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చింది.
Also Read: https://teluguprabha.net/viral/odisha-cuttack-15-foot-python-rescue-near-factory/
డెలివరీ విధానం గురించి అసలు తనకేం తెలియకపోయినా వికాస్ బెడ్రే ధైర్యం చేశాడు. డాక్టర్ సూచనలు పాటిస్తూ ఆమెకు పురుడు పోసి తల్లీబిడ్డను కాపాడాడు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది స్టేషన్‌కు వచ్చి తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వికాస్‌ను అభినందిస్తున్నారు. వికాస్ ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని కొనియాడుతున్నారు.


