Snake viral video: మనలో చాలా మంది పాములను చూస్తే అమడ దూరం పరుగెడతాం. మరికొందరు అయితే భయంతో వణుకుతారు. అయితే ఇలాంటి పాముల వీడియోలకే నెట్టింట మంచి ఆదరణ లభిస్తోంది. సర్పాల వీడియోలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా భారీ సంఖ్యలో పాముల వీడియోలను డంప్ చేస్తున్నారు. ఇందులో కాస్త విచిత్రంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ బ్లాక్ కింగ్ కోబ్రాను పట్టుకుని ఉంటాడు. అంతేకాకుండా అతడు ఏమాత్రం భయపడకుండా పాముకు ఉన్న పొరను తన చేతులతో తొలగిస్తూ ఉంటాడు. పాము యెుక్క చర్మాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తీయడాన్ని చూసి అక్కడున్న వారు షాక్ తిన్నారు. అతడు పాము యెుక్క కుబుసాన్ని వలుస్తున్నప్పుడు అది ఏమాత్రం కాటు వేయకుండా అలానే కూర్చుని ఉంది. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అది ధైర్యాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
వర్షాకాలం కావడంతో పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇవి బెడ్ రూమ్, బాత్రూమ్, కిచెన్, స్కూటీ డిక్కీ, కారు బానెట్.. ఇలా ఎక్కడపడితే అక్కడ నక్కి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొంత మంది స్నేక్ క్యాచర్స్ అయితే పాములను ఇళ్లలోనే పెంచుకుంటున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. అయితే ఒక్కోసారి ఈ స్నేక్ క్యాచర్స్ పాములతో డేంజరస్ స్టంట్స్ కు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి వారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అందుకే వారు కూడా సర్పాలతో ప్రవర్తించేటప్పుడు చాలా కేర్ పుల్ గా ఉండాలి.
Also read: Snake video – జుట్టు ఉన్న నాగుపామును ఎప్పుడైనా చూశారా?


