Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: రన్నింగ్ ట్రైన్ లో స్నానం చేసిన యువకుడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో స్నానం చేసిన యువకుడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Man taking bath in a train: సోషల్ మీడియాలో రోజూ కొన్ని వందల వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కుర్రాళ్ల చేస్తున్న చేష్టలు హద్దుమీరుతున్నాయి. ఫేమస్ అవ్వడానికి వాళ్లు ఏది చేయడానికైనా వెనుకాడటం లేదు. తాజాగా ఓ యువకుడు చేసిన అలాంటి పనే నెట్టింట హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు రైలు బోగీలో స్నానం చేస్తాడు. అతడు బాత్రూమ్ లో చేస్తే పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి ఏకంగా బోగీలోని మెట్ల వద్ద స్నానం చేస్తాడు. చుట్టు అందరూ చూస్తున్న ఏ మాత్రం సిగ్గులేకుండా బాతింగ్ కు పాల్పడ్డాడు. పైగా అతడు ఇన్నర్ ధరించి ఉంటాడు. అక్కడున్నవారు ఎంత చెప్పి చూసిన ఆ కుర్రాడు వినలేదు. రైలులో ప్రయాణిస్తున్న కొందరు ఆ యువకుడు చేస్తున్న చేష్టలను వీడియోగా రికార్డు చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఈ ఫన్నీ వీడియోపై కొందరు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు ట్రైన్ లో ప్రయాణించేవారికి అసౌకర్యాన్ని కలిగిస్తాయని.. పైగా అతడు చేసిన పని రైల్వే నిబంధనలు ఉల్లంఘించడం కిందకు వస్తుందని వారు కామెంట్ చేస్తున్నారు. కొంత మంది ఈ వీడియో చాలా హస్యాస్పదంగా ఉందని కామెంట్ పెడుతుంటే.. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ఆర్పీఎఫ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.

Also Read: Free Bus Effect -బస్సులో సీటు కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad