White cobra snake video viral: ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పాముల వీడియోలే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలు, కొండచిలువలు, ఆనకొండలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై రోజురోజుకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది. దీంతో ఎక్కడ ఏ పాము కనిపించినా దానిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో కుప్పలతెప్పలుగా స్నేక్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింటలో దర్శనమిస్తున్నాయి. కొంచెం డిఫరెంట్ గా ఉంటే చాలు ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
మనం కింగ్ కోబ్రాల్లో చాలా రకాలు చూస్తుంటాం. నల్లత్రాచు, నాగుపాము, కోడె నాగు, గోధుమ నాగు వంటివి తరుచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ శ్వేతనాగు మాత్రం చాలా అరుదుగా దర్శనమిస్తుంది. ఏకంగా మనోళ్లు అయితే శ్వేతనాగు మీద సినిమానే తీసేశారు. దాని ప్రభావమో ఏమో కానీ తెలుగోళ్లకు శ్వేతనాగంటే అమితమైన ఆరాధన. తాజాగా అలాంటి శ్వేతనాగుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
View this post on Instagram
మీరు ఓ లుక్కేయండి.వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ యువతి శ్వేతనాగును మెడలో వేసుకుని రీల్స్ చేస్తూ ఉంటుంది. ఆ వైట్ స్నేక్ బసులు కొడుతున్న ఏ మాత్రం భయపడకుండా రీల్ రికార్డు చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట సందడి చేస్తుంది. దీనిపై రకరకాలు కామెంట్లు వస్తున్నాయి. ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఇది ఏఐ జనరేటెడ్ పాము అని మరికొందరు అంటున్నారు. మెుత్తానికి అయితే ఈవీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Also Read: Python Video – మనిషిని మింగిన కొండచిలువ
సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. దీని కోసం వారు ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనుకాడట్లేదు. పాపులారిటీ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వీడియోలు చేస్తున్నారు. రీసెంట్ గా రీల్ కోసం ఓ అబ్బాయి రైలు కింద పడుకుంటే.. మరోకరు ఎతైన ప్రదేశంలో స్టంట్ చేశారు. నూరేళ్ల జీవితాన్ని చిన్న రీల్ కోసం రిస్క్ లో పెట్టడం అవసరమా అనిపిస్తూ ఉంటుంది.


