Youtuber Anvesh stops world tour videos: ప్రపంచ యాత్రికుడు, ‘నా అన్వేషణ’తో పాపులర్ అయిన యూట్యూబర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రపంచ యాత్రను ఆపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించి చాలంటూ.. కొత్త వాళ్లకి అవకాశం ఇస్తున్నానని తెలిపారు. అంతేకాదు.. తన దగ్గర ఉన్న రూ. 8 కోట్లను తన కోసం ఖర్చు పెట్టుకుంటానని.. ఇకపై ప్రజా సమస్యలపైనే పోరాడతానంటూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఇటీవల యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో అన్వేష్ యూట్యూబ్ ఛానల్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా పలు హిందూ సంఘాల ఫిర్యాదుతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అన్వేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రావెలింగ్ వీడియోలు ఆపేద్దామనుకుంటున్నట్లు వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/technology-news/extend-battery-life-with-settings-tips/
‘ప్రపంచయాత్రలో భాగంగా ఇప్పటివరకూ 130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర రూ. 8 కోట్లు ఉన్నాయి. వాటితో మీకోసం కాకుండా నాకోసం మిగిలిన దేశాలు తిరుగుతా. ప్రాణం ఉన్నంత వరకూ ప్రజా సమస్యలపై పోరాడుతా’ అని అన్వేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
అంటార్కిటికాను ఇప్పటివరకూ ఎవరూ చూపించలేదని.. తాను చూపించినందుకు రూ. 20 లక్షల రూపాయిలు వచ్చాయని అన్వేష్ అన్నారు. ఆర్కిటిక్ మొత్తం చూపించినందుకు రూ.15 లక్షలు వచ్చాయని.. అమెజాన్ అడవులను దాదాపు 100 రోజులు చూపించడంతో రూ.20 లక్షలు సంపాదించినట్లు చెప్పారు. ఇప్పటివరకూ సంపాదించింది చాలంటూ.. ఇకపై కొత్త వాళ్లకి అవకాశం ఇస్తానని అన్వేష్ పేర్కొన్నారు. ‘’ప్రపంచ యాత్ర’ ప్రయాణంలో కాళ్లు చేతులు విరుగుతాయి.. ప్రాణాలుపోతాయి. ఎన్ని జరిగినా కూడా ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకుని ముందుకు వెళ్లండి. అన్నీ.. విజయాలే అంతా మంచే జరుగుతుంది.’ అంటూ అన్వేష్ కొత్త వాళ్లకి సూచించారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/shattila-ekadashi-2026-date-significance-fasting-rules/
ఇప్పుడు తన వద్ద ఉన్న డబ్బులతో ప్రపంచ దేశాలన్నీ తన కోసం తిరుగుతానని అన్వేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సమస్యలపై దృష్టిపెడతానని.. ఆన్ లైన్ బెట్టింగులు, బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లు ఇంకా చాలా స్కాంలు ఉన్నాయని.. వాటన్నింటిపై ప్రజలకు అవగాహన కలిపిస్తూ పోరాటంచేస్తానని స్పష్టం చేశారు. మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి మాట్లాడటమే కాకుండా.. స్త్రీ హక్కులపై పోరాడదామని అన్వేష్ పిలుపునిచ్చారు.

