Zebra vs Crocodiles: భూమ్మీద ప్రమాదకర జంతువుల్లో మెుసలి కూడా ఒకటి. నీటిలో మెుసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందని అంటారు. అలాంటి నీటిలో మెుసళ్లు గుంపు మధ్య ఏ జంతువువైనా చిక్కిందంటే బలవ్వక తప్పదు. కానీ ఇక్కడ సీన్స్ రివర్స్ అయింది. మకరానికే ముచ్చెమటలు పట్టించి తప్పించుకుని పోయింది ఓ జీబ్రా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్షేషన్ గా మారింది.
వీడియోలోకి వెళితే.. మంచి నీటి కోసం నీళ్లలోకి దిగి మెుసళ్ల గుంపుకు దొరికిపోయింది జీబ్రా. అయినా ఏమాత్రం చింతించలేదు. మెుసళ్లన్నీ దాని చుట్టుముట్టినా దైర్యంగా ఎదిరించింది. ఏకంగా ఓ మెుసలి నోటిని తన నోటితో కొరికేసింది. తర్వాత మెుసళ్లన్నీ ఒక్కోక్కటిగా దాడి చేయడానికి ప్రయత్నించాయి. వాటిన్నింటితో కూడా ధైర్యంగా పోరాడింది. చివరకు ఎలాగోలా ఒడ్డుకు చేరి ప్రాణాలు రక్షించుకుంది. ఇక్కడ జీబ్రా పోరాటానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ వీడియోను @AMAZlNGNATURE అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటి మందికిపైగా వీక్షించారు. లక్షల్లో లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. లైఫ్ లో చివరి నిమిషం వరకు ఓటమిని ఆంగీకరించకూడదని జీబ్రా పోరాడిన తీరు తెల్పుతుందని నెటిజన్స్ అంటున్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సహనం కోల్పోకుండా దైర్యంగా ముందుకు వెళ్లడానికి ఈ జీబ్రా పోరాడిన తీరు మనందరికీ ఆదర్శం.
మెుసళ్లు సరీసృపాలు అయితే జీబ్రాలు క్షీరాదాలు. తెలుగులో జీబ్రాను చారల గుర్రము అని పిలుస్తారు. ఇక మెుసళ్లు డైనోసార్ ల కాలం నుండి ఈ భూమ్మీద జీవిస్తూ వస్తున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా ఎన్నో జీవులు అంతరించినప్పుటికీ ఈ మెుసళ్ల జాతి మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. వాటి శరీర నిర్మాణమే దాని బలం. మకరానికి దాని దవడలే బలం. ఎంతటి జంతువునైనా ఇది నమిలి తినేయగలదు. మెుసళ్లలో ఘరియల్స్, ఘగ్గర్స్, ఎలిగేటర్లు, కెయ్ మెన్ వంటి జాతులు ఉన్నాయి.