డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి అపోహలుంటాయి. తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఆరోగ్య సమస్యలు వస్తాయని భావిస్తారు.

అయితే, ఈ అపోహలన్నీ బాదం విషయంలో సరికాదంటున్నారు నిపుణులు.దీనివల్ల విటమిన్ 'ఇ'తో పాటు మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయి.

మహిళలు క్రమం తప్పకుండా బాదంపప్పు తింటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువ.

బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం. మరి విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలున్న ఇవి తింటే బరువు కూడా తగ్గుతారు.

శీతాకాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడే ఆహారం తీసుకోవాలి. అందుకోసం బాదం పప్పును ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి.

28 గ్రాముల బాదం పప్పులో 3.5 గ్రాముల ఫైబర్, 6 గ్రాముల ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, కొవ్వు, విటమిన్ ఈ, మాంగనీస్ 27 శాతం, మెగ్నీషియం 18 శాతం ఉంటాయి.

ఆహారంలో ఎన్ని బాదంపప్పులు చేర్చుకోవాలనే వయస్సు, లింగం, శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తి రోజుకు 5 నుండి 10 నానబెట్టిన బాదంపప్పులు తినవచ్చని నిపుణులు అంటున్నారు.