ఆషికా రంగనాథ్..1996 ఆగస్టు 05న కర్నాటకలోని తుమకూరులో జన్మించింది.
ఈ ముద్దుగుమ్మ ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్ట్రన్‌తో సహా వివిధ నృత్య రూపాలలో శిక్షణ పొందింది.
మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నరప్‌గా నిలిచింది.
2016లో 'క్రేజీ బాయ్' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
రాజు కన్నడ మీడియం, రాంబో2, మధగజ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
2023లో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
'నా సామిరంగ' సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది.